Asianet News TeluguAsianet News Telugu

'ఓం భీమ్ బుష్' కలెక్షన్స్ పరిస్దితి ఏంటి, బ్రేక్ ఈవెన్ కు ఎంతదూరం?

హోలీ కూడా కలిసి వచ్చి లాంగ్ వీకెండ్ అవటంతో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చే అవకాసం ఉంది.   ఈ చిత్రానికి రెండు రోజుల్లో కలెక్షన్లు ఎంత వచ్చాయంటే..

Sri Vishnu Om Bheem Bush Movie will capitalize on the long weekend? jsp
Author
First Published Mar 24, 2024, 5:15 PM IST


 శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్‍లో వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమా స్లోగా స్టార్ట్ అయ్యినా మెల్లిగా పికప్ అవుతోంది.  అందుకు నిదర్శనం ఈ చిత్రాకి మొదటి  రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు రావటమే. పాజిటివ్ టాక్ రావటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పికప్ అయ్యింది. మార్చి 22వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ హారర్ మూవీకి యావరేజ్ టాక్ తెచ్చుకున్నా మార్కెట్లో వేరే సినిమా పోటీ లేకపోవటం కలిసొచ్చింది. అందులోనూ కామెడీ చిత్రం కావటంతో ఓ సారి చూద్దాంలే అని వీకెండ్ లో జనం మూవ్ అవుతున్నారు. హోలీ కూడా కలిసి వచ్చి లాంగ్ వీకెండ్ అవటంతో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చే అవకాసం ఉంది.   ఈ చిత్రానికి రెండు రోజుల్లో కలెక్షన్లు ఎంత వచ్చాయంటే..


మొదటి రోజు  - 01.15cr
రెండో రోజు  - 01.65cr

రెండు రోజుల  కలెక్షన్స్  

తెలంగాణా - 01.45cr
( Share Brake Even - 03.00cr )

ఆంధ్రా - 01.35cr
( Share Break Even - 05.00cr )

Telugu States 2Days 
Total Theatrical Gross - 05.05cr

Telugu States 2Days 
Total Theatrical Share - 02.80cr

Karnataka+Rest Of India+Overseas -01.25cr

Worldwide 2Days
Total Theatrical Gross - 07.65cr

Worldwide 2Days
Total Theatrical Share - 04.05cr

Worldwide Theatrical Share Break Even - 10.00cr

రెండు రోజుల కలెక్షన్ల వివరాలను యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. బ్లాక్‍బస్టర్ లాఫ్స్ ఆల్ఓవర్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఆ ప్రొడక్షన్. రెండో రోజుల్లో రూ.10.44 కోట్లు వచ్చాయంటూ పేర్కొంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూవీ 2.50లక్షల డాలర్ల మార్కును దాటింది.

 
 ఈ సినిమా అసలు కథ కోసం ఎల్జీబీటీ అంశాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు. ఆ అంశాన్ని రాజుల కాలంతో ముడిపెట్టారు. ఏదైమైనా కామెడీ కథతో శ్రీవిష్ణు మరో హిట్ కొట్టారనే చెప్పాలి.   శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాను వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సన్నీ ఎమ్ఆర్ సంగీతాన్ని ఇచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios