Asianet News TeluguAsianet News Telugu

'ఓం భీమ్ బుష్' OTT డిటేల్స్. ఎప్పుడు? ఎక్కడ?

క్రేజీ కామెడీగా రూపొందిన 'ఓం భీమ్ బుష్' మూవీ ఈ  శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ వర్కౌట్‌ అయ్యింది. కానీ కథలో విషయం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. 
 

Sri Vishnu Om Bheem Bush Movie Ott Release And Streaming Date Details jsp
Author
First Published Mar 23, 2024, 10:04 AM IST

తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించే శ్రీవిష్ణు ఈ సారి 'ఓం భీమ్ బుష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మొదటి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు కలెక్షన్లు భారీగానే లభించాయి.  ఈ సినిమా  ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అనే క్యాప్షన్  తో వచ్చింది. అందుకు  తగ్గట్టుగానే లాజిక్‌తో సంబంధం లేకుండా కేవలం నవ్వులు పంచడంపైనే దృష్టిపెట్టాడు దర్శకుడు. ఈ విషయంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడు కూడా. ఈ నేపధ్యంలో  'ఓం భీమ్ బుష్' ఓటిటి డిటేల్స్ బయిటకు వచ్చాయి.

Survey: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని  ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ మేరకు నిర్మాతలకు అమెజాన్ ప్రైమ్ సంస్థ బాగానే ముట్టజెప్పిందని తెలుస్తోంది. అయితే ఎప్పుడు స్ట్రీమింగ్ మొదలు కావచ్చు అంటే అన్ని ఎగ్రిమెంట్ లాగానే  ఈ  సినిమాను థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు స్ట్రీమింగ్ చేయాలన్న రూల్ తో లాక్ చేసారని తెలుస్తోంది. మార్చి 22న రిలీజైన ఓం భీమ్ బుష్ సినిమాను ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాసం ఉంది. అయితే సినిమా కలెక్షన్స్ బాగుండి సూపర్ హిట్ అయితే స్ట్రీమింగ్ తేదీని మారుస్తారు.  ఏదైమైనా మూవీ ఓటీటీ విడుదలపై అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చినప్పుడే పూర్తి క్లారిటీ వస్తుంది.

 ఈ సినిమా అసలు కథ కోసం ఎల్జీబీటీ అంశాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు. ఆ అంశాన్ని రాజుల కాలంతో ముడిపెట్టారు. ఏదైమైనా కామెడీ కథతో శ్రీవిష్ణు మరో హిట్ కొట్టారనే చెప్పాలి.   శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాను వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సన్నీ ఎమ్ఆర్ సంగీతాన్ని ఇచ్చాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios