సడెన్ గా జనసేన పార్టీ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది. అదేంటంటే శ్రీ రెడ్డి జనసేన పార్టీలో చేరడమే.. ఈ అనౌన్స్మెంట్ చూసిన వారంతా షాక్ అయ్యారు. పవన్ ని తిడుతూ ఆయనపై చెడు ప్రచారం చేసే శ్రీరెడ్డిని జనసేన పార్టీలో చేర్చుకోవడంఏంటో ఎవరికీ అర్ధం కాలేదు.

పైగా శ్రీరెడ్డి తన సోషల్ మీడియా పేజ్ లో 'ఎలా ఉంది సర్ప్రైజ్' అంటూ పోస్ట్ కూడా పెట్టింది. దీంతో అంతా అవాక్కయ్యారు. శ్రీరెడ్డి అంటేనే చిరాకు పడే జనసైనికులు దీనికి ఎలా ఒప్పుక్కున్నారని చర్చలు మొదలయ్యాయి.

అయితే నిజానికి జనసేన పార్టీలో చేరేది ఎస్.పీ.వై రెడ్డి.. అతడి పేరు పొరపాటుగా శ్రీ రెడ్డి అని పడింది. ఈ తప్పుని సరి చేయకుండానే జనసేన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేయడంతో.. ఇది కాస్త వైరల్ అయింది. అయితే ఆ పోస్ట్ ని తొలగించి శ్రీ ఎస్.పీ.వై రెడ్డి పేరుతో కొత్త పోస్ట్ ని రీప్లేస్ చేశారు.

అయితే అప్పటికే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శ్రీరెడ్డి వెంటనే హడావిడి మొదలెట్టింది. జనసేన చేసిన మిస్టేక్ ని తన పబ్లిసిటీ కోసం వాడేసుకుంటోంది.