టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై గత కొంత కాలంగా అనేక రకాల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేస్తూ జీవో నంబర్‌ 984 ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయంపై నటి శ్రీ రెడ్డి స్పందించారు. 

మహిళా నటులు ఎదుర్కొంటున్న చేదు అనుభవాల గురించి మొదట శ్రీ రెడ్డి తన  గొంతు విప్పి చాటి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్యానెల్ ఏర్పడటంతో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. నా కల నిజమయ్యింది. ఒక హైదరాబాద్ స్త్రీగా నేను చాలా గర్వపడుతున్నా.

ఈ వరల్డ్ కి నన్ను హీరోయిన్ ని చేశారు. నా పోరాటానికి ఒక ఏడాదిలోనే అద్భుత ఫలితాలు వచ్చాయి. ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా అపూర్వ - సంధ్య - వసుధ వంటి వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలని శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

ఇక తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్ మోహన్ రావు, నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకనిర్మాత సుధాకర్ రెడ్డి కూడా ప్యానెల్ లో సభ్యులుగా ఉన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు నిర్భయంగా చెప్పవచ్చునని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ తెలిపింది.

శ్రీరెడ్డి ఆరోపణల ఎఫెక్ట్: టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై ప్యానెల్