ఇటీవల నాని నటించిన 'జెర్సీ' సినిమా విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సెలబ్రిటీలు, అభిమానులు ప్రతీ ఒక్కరూ నానిని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

నాని నటన అధ్బుతమని తన పాత్రలో జీవించేశాడని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. కానీ నటి శ్రీరెడ్డి మాత్రం మరోసారి నానిని టార్గెట్ చేస్తూ కామెంట్స్  చేసింది. ఆమెకి నానితో ఉన్న శత్రుత్వం ఏంటో కానీ సందర్భం దొరికిన ప్రతీసారి అతడిపై విరుచుకుపడుతుంది.

మరోసారి అతడిని ఉద్దేశిస్తూ యాక్టింగ్ చూసిన నిజ జీవితంలో కూడా మంచోడు అనుకుంటున్నారు.. కర్మరా బాబు అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూసిన నాని అభిమానులు  శ్రీరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధారాలు ఉంటే చూపించాలే తప్ప ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.