Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 5: ఫైనలిస్ట్ గా శ్రీరామ్‌ విన్నర్‌.. కాజల్‌పై సన్నీ ఫైర్‌.. చప్పగా సాగుతున్న బిగ్‌బాస్‌ షో

బిగ్‌బాస్‌ తెలుగు 5 (Bigg Boss Telugu 5) షో ఆసాంతం చప్పగా సాగుతుంది. వేడి తగ్గిపోయింది. కంటెస్టెంట్లు కూల్‌గా గేమ్‌లు ఆడుకుంటున్నారు. ఒకటి రెండు చిన్న చిన్న ఫైరింగ్‌ సన్నివేశాలు తప్ప మిగతాదంతా బోరింగ్‌గా సాగుతుంది.

sreeram first finalist for bigg boss telugu 5 season
Author
Hyderabad, First Published Dec 3, 2021, 11:55 PM IST

బిగ్‌బాస్‌ తెలుగు 5 (Bigg Boss Telugu 5) షో ఆసాంతం చప్పగా సాగుతుంది. వేడి తగ్గిపోయింది. కంటెస్టెంట్లు కూల్‌గా గేమ్‌లు ఆడుకుంటున్నారు. ఒకటి రెండు చిన్న చిన్న ఫైరింగ్‌ సన్నివేశాలు తప్ప మిగతాదంతా బోరింగ్‌గా సాగుతుంది. ఈ వారం ప్రారంభం నుంచి ఊపు తగ్గింది. రక్తికట్టించే గేమ్‌లు లేవు, నువ్వా నేను అనేలా ఆడేందుకు ఇంటి సభ్యులు ఆసక్తి చూపడం లేదు. పైగా గాయాలు కావడం షోని నీరుగార్చుతుంది. ఇక  Bigg Boss Telugu 5 శుక్రవారం ఎపిసోడ్‌లో భాగంగా జరిగిన `టికెట్‌ టు ఫినాలే` గేమ్‌లో అంతిమంగా శ్రీరామ్‌ విన్నర్‌గా నిలిచాడు. బిగ్‌బాస్‌ 5 సీజన్‌కి తొలి ఫైనలిస్ట్ గా నిలిచాడు. 

`టికెట్‌ టూ ఫినాలె` టాస్క్ ఈ శుక్రవారం కూడా కంటిన్యూ అయ్యింది. సౌండ్స్ ని బట్టి అవి ఏంటో గుర్తించాలనే టాస్క్ లో సన్నీ, శ్రీరామ్‌, సిరి, మానస్‌ పాల్గొన్నారు. ఇందులో అత్యధికంగా మార్క్ లు సాధించి సన్నీ, మానస్‌ టాప్‌లో నిలిచారు. వీరిద్దరి మధ్య వాటర్‌ బాటిల్స్ నింపే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో సన్నీ ఫస్ట్, మానస్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత లైట్స్ సరిచేసే టాస్క్ లో అందరి కంటే తక్కువ సమయంలో లైటింగ్స్ సెట్‌ చేసి శ్రీరామ్‌ టాప్‌లో నిలిచాడు. అయితే ఆయన కాలికి గాయం కావడంతో షణ్ముఖ్‌ గేమ్‌ ఆడాడు. మానస్‌తో పోటీ పడ్డారు. ఈ మొత్తం టాస్క్ లో శ్రీరామ్‌ అతితక్కువ టైమ్‌లో లైట్స్ సెట్‌ చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. సన్నీ, సిరి, మానస్‌ వరుసగా నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. 

ఇక ఇప్పటి వరకు జరిగినా గేమ్స్ లో టాప్‌లో శ్రీరామ్‌, మానస్‌ నిలవగా, సన్నీ, సిరి మూడు, నాల్గో స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో టాప్‌ టూ సభ్యులకు మరో గేమ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో థ్రెడ్‌కి వెయిట్‌తో కూడిన సంచులుంటాయి. వాటితో నిచ్చెన లాంటి దానికి ఉన్న ప్లేట్లని పగల గొట్టాల్సి ఉంటుంది. ఇందులో వేగంగా ఆ ప్లేట్లని పగలగొట్టి శ్రీరామ్‌ విన్నర్‌ అయ్యాడు. ఈ సీజన్‌లో మొదటి ఫైనలిస్ట్ గా శ్రీరామ్‌ నిలిచాడు. దీంతో ఆయన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. 

మరోవైపు సిరికి మోషన్స్ పెడుతుండగా, ప్రియాంక తన సొంత టిప్‌ చెప్పింది. దీంతో ఆమెపై బిగ్‌బాస్‌ సీరియస్‌ అయ్యాడు. సొంత వైద్యం చేయోద్దని వార్నింగ్‌ ఇచ్చాడు. ఇది కామెడీగా మారింది. మరోవైపు కాజల్‌ ఒంటరిగా పడుకొన్ని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో మానస్‌ ఓదార్చాడు. మరోవైపు మొన్నటి వరకు పులిహోర కలుపుతూ ఆసక్తి రేకెత్తించిన షణ్ముఖ్‌, సిరి సైలెంట్ అయ్యారు. అలా బెడ్‌పై పడుకుని చూస్తు ఉన్నారు. ఇలా ఒకటి రెండు ఫన్నీ సన్నివేశాలు తప్ప ఈ రోజు షో బోరింగ్‌గా సాగిందని నెటిజన్లు కామెంట్ చేస్తుండటం గమనార్హం. 

ఇక బిగ్‌బాస్‌ తెలుగు 5 షో పదమూడో వారం చివరకు చేరుకుంది. ఈ వారంలో ప్రియాంక, సిరి, శ్రీరామ్‌, మానస్‌, కాజల్‌ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు షో ముగియడానికి ఇంకా రెండు వారాలు మాత్రమే ముంది. మరి ఈ సీజన్‌లో ఎవరు విజేత అవుతారనేది ఆసక్తికరగా మారింది. విజేతగా సన్నీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. షణ్ముఖ్‌, శ్రీరామ్‌, సన్నీ మధ్య పోటీ ఉంటుందని టాక్‌. 

also read: Bigg boss telugu:ఓడిపోయి బయటకొచ్చానని అన్నీ మూసుకు కూర్చున్నా... కొందరు డబ్బులు ఇచ్చి...
 

Follow Us:
Download App:
  • android
  • ios