'క్రేజీ అంకుల్స్‌'.. టైటిల్‌తో టాలీవుడ్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. శ్రీముఖి, భరణి, మనో, పోసాని కృష్ణ మురళి,రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్‌ సినిమా గ్రూప్‌, శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్స్‌పై తెరకెక్కుతోంది. ఒక పాట మినహా షూటింగ్‌ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను తెలియజేసేందుకు చిత్రయూనిట్‌ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.


ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్‌, ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించిన మనో మాట్లాడుతూ .. ''క్రేజీ అంకుల్స్ సినిమాలో ఒక మంచి ఎంటర్టైనింగ్ రోల్‌లో నటించాను. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌లో మంచి యూనిట్‌తో సినిమా చేయడం సంతోషంగా ఉంది. షూటింగ్ సరదాగా జరిగింది. ఫ్యామిలీ అందరూ హాయిగా నవ్వుతూ చూసే సినిమా ఇది. రాజారవీంద్ర, శ్రీముఖి గారితో వర్క్ చెయ్యడం హ్యాపీగా ఉంది. శ్రీవాస్ గారు భవిషత్తులో ఇలాంటి మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రేజీ అంకుల్స్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ..''ఈ సినిమాలో నేను యోగా టీచర్‌గా కనిపించబోతున్నాను. కరోనా సమయంలో వర్క్స్ లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ కు గుడ్ సినిమా గ్రూప్స్ వారు వారికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపాధి కల్పించడం నిజంగా అభినందించాల్సిన విషయం. భవిష్యత్తులో గుడ్ సినిమాస్ గ్రూప్ సంస్థ నుండి మరిన్ని మంచి సినిమాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది. ఈ మూవీ తప్పకుండా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది" అన్నారు.

నిర్మాత శ్రీవాస్ మాట్లాడుతూ.. ''శ్రేయాస్ శ్రీను, నేను కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్న టైమ్‌లో నాకు రైటర్ డార్లింగ్ సామి చెప్పిన పాయింట్ నచ్చి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ను బేస్ చేసుకొని చేసిన చిత్రమిది. శ్రీముఖి, రాజా రవీంద్ర, మనో ఇలా అందరి రోల్స్ ఆడియన్స్ ను అలరించబోతున్నాయి. డైరెక్టర్ సత్తిబాబు స్క్రిప్ట్ ను బాగా హ్యాండిల్ చేశారు. ఈ కోవిడ్ టైంలో మేము మరింత మందికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము" అని తెలుపగా.. ''నేను ఈ మధ్య కాలంలో చేసిన ఫుల్ లెన్త్ ఎంటర్‌టైన్‌మెంట్‌ రోల్ ఇది. శ్రీవాస్ కథ చెబుతున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. సినిమా షూటింగ్ కూడా సరదాగా సాగిపోయింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది" అని అన్నారు నటుడు రాజా రవీంద్ర.

''శ్రేయాస్ శ్రీను ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసి సక్సెస్ అయ్యారు. ఆయన ప్రొడక్షన్ చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీవీలో ఎక్కువగా షోస్ చేస్తున్న నేను క్రేజీ అంకుల్స్ సినిమాలో ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఒక పాట మినహా దాదాపు షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఆ పాట చిత్రీకరణ జరుపబోతున్నాం. గుడ్ సినిమా గ్రూప్ లో ఇదొక మంచి మూవీగా నిలుస్తుందని భావిస్తున్నాను" అని తెలిపింది నటి శ్రీముఖి.