Asianet News TeluguAsianet News Telugu

కాజల్ ని భరించలేక శ్రీలీలని పెట్టుకున్నారు.. ఒక గంటకి అన్ని లక్షలా ?

పెళ్లి తర్వాత కూడా కాజల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. మునుపటిలానే క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. కాజల్ చివరగా భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. 

Sreeleela replaces Kajal for this crazy deal dtr
Author
First Published Nov 18, 2023, 9:05 PM IST | Last Updated Nov 18, 2023, 9:05 PM IST

పెళ్లి తర్వాత కూడా కాజల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. మునుపటిలానే క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. కాజల్ చివరగా భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా నటించింది. బాలయ్య కూతురిగా శ్రీలీల ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. 

అయితే కాజల్ కి తన కోస్టార్ శ్రీలీల నుంచి చిన్నపాటి షాక్ తగిలింది. స్టార్ హీరోయిన్లకి ఉన్న క్రేజ్ కారణంగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, జ్యువెలరీ ప్రకటనలు, ఇతర డిజైనర్ బ్రాండ్స్ ప్రకటనల కోసం వారిని సంప్రదిస్తుంటారు. పెద్ద బ్రాండ్స్ కి అయితే కోట్లల్లో రెమ్యునరేషన్ ఉంటుంది. 

ప్రాధాన్యతని బట్టి లక్షల్లో కూడా ఉంటుంది. అయితే ఇటీవల కాజల్ ని హైదరాబాద్ కి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తమ కరపత్రం లాంచ్ ఈవెంట్, ప్రచారానికి సంప్రదించారట. అయితే కాజల్ అగర్వాల్ మేనేజర్ ఏకంగా రూ 15 లక్షలు డిమాండ్ చేశాడట. కేవలం గంట ప్రచార కార్యక్రమానికి ఆ రేంజ్ లో అమౌంట్ డిమాండ్ చేయడంతో సదరు సంస్థ షాక్ అయింది. 

దీనితో అంత మొత్తం చెల్లించలేక శ్రీలీలని సంప్రదించారు. శ్రీలీల రూ. 12 లక్షలకు అంగీకరించిందట. కాజల్ అయితే ట్రావెలింగ్ ఖర్చులు కూడా ఉంటాయి. శ్రీలీల లోకల్ గానే ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు కూడా ఆ సంస్థకి కలసి వచ్చిందట. మొత్తంగా కాజల్ ని పక్కన పెట్టి శ్రీలీలని ఎంపిక చేసుకోవడంతో రూ 5 లక్షల భారం ఆ సంస్థకి తగ్గినట్లు తెలుస్తోంది. 

శ్రీలీల ప్రస్తుతం గుంటూరు కారం, ఆదికేశవ,నితిన్ ఎక్స్ట్రా లాంటి చిత్రాల్లో నటిస్తోంది. చివరగా ఆమె నుంచి స్కంద, భగవంత్ కేసరి చిత్రాలు విడుదల కాగా భగవంత్ కేసరి మాత్రమే హిట్ అయింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios