అతిరథ మహారథుల నడుమ చిక్కబళ్లాపూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అతిరథ మహారథుల నడుమ చిక్కబళ్లాపూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కర్ణాటక వైద్యశాఖ మంత్రి కూడా హాజరయ్యారు. హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ కూడా అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అభిమానుల కోలాహలం మధ్య ఈవెంట్ వైభవంగా సాగింది. 

ప్రీ రిలీజ్ వేడుకలో రాంచరణ్, ఎన్టీఆర్ తమ అప్పియరెన్స్ తో, స్పీచ్ తో ఆకట్టుకున్నారు. కానీ ప్రీ రిలీజ్ వేడుకలో ఓ యంగ్ బ్యూటీ అందరినీ ఆకర్షించింది. ఆమె ఎవరో కాదు.. పెళ్లి సందD చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల. తొలి చిత్రంతోనే తన హాట్ అండ్ క్యూట్ లుక్స్ తో శ్రీలీల మెస్మరైజ్ చేసింది. 

ప్రస్తుతం శ్రీలీలకు టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి. శ్రీలీల బెంగుళూరుకి చేసిన అమ్మాయి. అయితే శ్రీలీల తనకు ఎలాంటి సంబంధం లేని ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎందుకు హాజరైంది అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కన్నడ మీడియా అయితే.. రాజమౌళి నెక్స్ట్ మూవీలో శ్రీ లీల ఛాన్స్ దక్కించుకుందా అంటూ గాసిప్స్ కూడా సృష్టిస్తున్నారు. 

కానీ అసలు విషయం వేరే. శ్రీలీల బెంగుళూరుకి చెందిన నటి. కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న కె వి ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత వెంకట్ తో శ్రీలీల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిక్కబళ్లాపూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది కెవిఎన్ సంస్థ వారే. దీనితో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శ్రీలీలకి కూడా ఆహ్వానం అందిందట. అందుకే శ్రీలీల ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసింది. 

తన క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు హుషారుగా క్లాప్స్ కొట్టింది. అలాగే రాంచరణ్ చేతుల మీదుగా మొమెంటోని కూడా అందుకుంది ఈ బ్యూటీ.