టాలెంటెడ్ యంగ్ యాక్టర్ శ్రీ విష్ణు డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నాడు. ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త పాయింట్ తో ఓ వర్గం ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోన్న శ్రీ విష్ణు నెక్స్ట్ తిప్పరా మీసం అనే సినిమాతో రాబోతున్నాడు.  ఫుల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. 

గతంలో శ్రీ విష్ణు నటించిన నీది నాది ఒకే కథ - మెంటల్ మదిలో సినిమాలతో పాటు ఇటీవల వచ్చిన బ్రోచేవారెవరురా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేధనిపించే విధంగా కలెక్షన్స్ ని రాబట్టాయి. ఇక ఇప్పుడు వాటికంటే బిన్నంగా తిప్పరా మీసం అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇటీవల సినిమాకు సంబందించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. శ్రీ విష్ణు లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆ పోస్టర్ సినీ లవర్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమా టీజర్ ను మరో రెండు వారాల్లో రిలీజ్ చేయాలనీ శ్రీ విష్ణు ప్లాన్ చేసుకుంటున్నాడు. నారా రోహిత్ అసురా సినిమాకు దర్శకత్వం వహించిన కృష్ణా విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ సినిమాను నిర్మిస్తున్నాడు.