Asianet News TeluguAsianet News Telugu

#Srivishnu:శ్రీవిష్ణు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా ? తేడా వస్తే....


 వరసగా గాలి సంపత్, అర్జున ఫల్గుణ,తిప్పరా మీసం, వీరభోగ వసంత రాయులు అంటూ చేస్తున్న ప్రతీ సినిమా ప్లాఫ్ అవుతోంది.  కొంత కాలం క్రితమే భళా తందానాన మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.  

Sree Vishnu Next With Vivaha Bhojanambu Maker
Author
First Published Sep 26, 2022, 2:44 PM IST


హిట్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఎప్పటి కప్పుడు పైవిద్యమైన మూవీ లలో నటిస్తూ తన నటన తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు శ్రీ విష్ణు. అతని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నీది నాది ఒకే కథ , మెంటల్ మదిలో , బ్రోచే వారెవరురా , రాజ రాజ చోర వంటి వైవిధ్యమైన మూవీ లతో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు శ్రీ విష్ణు.అయితే ఆయన కెరీర్ గత కొంతకాలంగా దారి తప్పింది.

 వరసగా గాలి సంపత్, అర్జున ఫల్గుణ,తిప్పరా మీసం, వీరభోగ వసంత రాయులు అంటూ చేస్తున్న ప్రతీ సినిమా ప్లాఫ్ అవుతోంది.  కొంత కాలం క్రితమే భళా తందానాన మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. ఆ తర్వాత ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు అల్లూరి అనే మూవీ లో హీరో గా నటించాడు. అదీ తేడా కొట్టేసింది. ఈ నేపధ్యంలో శ్రీ విష్ణు కామెడీ సినిమాలు సేఫ్ అనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రెండు ప్రాజెక్టులు ఓకే చేసినట్లు చెప్తున్నారు.

మొదట వివాహ భోజనంబు(ఓటీటీ ప్రాజెక్ట్) తో ఆకట్టుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేతులు కలిపారు. శ్రీవిష్ణుతో చేయబోతున్న కొత్త చిత్రంతో రామ్ అబ్బరాజు థియేటర్ సినిమాకి పరిచయం కానున్నారు. హాస్య మూవీస్ పతాకంపై  రాజేష్ దండా నిర్మాణంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర  సమర్పిస్తున్నారు.  పూర్తి ఫన్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది.  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

మరో ప్రక్క హుషారు సినిమాతో పరిచయం అయిన  శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వంలో ఓ చిత్రం కమిటైనట్లు సమాచారం. హారర్ కామెడీగా ఆ సినిమా రూపొందనున్నట్లు చెప్తున్నారు. ఈ రెండు సినిమాతో శ్రీ విష్ణు  పూర్తి స్దాయిలో ఫామ్ లోకి వస్తారని నమ్ముతున్నారట. అందులోనూ శ్రీవిష్ణు కామెడీ బాగా పండిస్తారు కాబట్టి ఖచ్చితంగా హిట్ కొడతారని నమ్ముతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios