Asianet News TeluguAsianet News Telugu

Alluri :`అల్లూరి`టీజ‌ర్‌ లో ఈ ఎలిమెంట్స్ గమనించారా?


 ”ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ప్ చుప్‌.. పోలీస్ బ‌య‌ల్దేరాడు రా” అనే డైలాగ్ తో టీజ‌ర్ మొద‌లైంది. టీజ‌ర్‌లో చాలా షాట్లు ప‌డ్డాయి. అయితే ఏ ఒక్క‌రి క్యారెక్ట‌రు పూర్తిగా రివీల్ చేయ‌లేదు. చైత‌న్యానికి నాంది, విప్ల‌వానికి పునాది.. నిజాయ‌తీకి మారు పేరు.. అంటూ.. ‘అల్లూరి’ పాత్ర‌ని ప‌రిచ‌యం చేశారు. పోలీస్ గెట‌ప్ లో శ్రీ‌విష్ణు లుక్ అదిరేటట్లు  ఉంది.

Sree Vishnu Alluri Movie teaser review
Author
Hyderabad, First Published Jul 4, 2022, 2:58 PM IST

హిట్, ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా వరస సినిమాలు చేస్తున్నారు శ్రీవిష్ణు. రీసెంట్ గా వచ్చిన భళా తందనానా వర్కవుట్ కాకపోయినా నిరాశపడకుండా మరో వైవిధ్యమైన యాక్షన్ కథతో మన ముందుకు రాబోతున్నాడు.   కెరీర్‌లో తొలిసారి ఓ పోలీస్ పాత్ర పోషించాడు.  సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ లక్కీ మీడియా పై బెక్కెం వేణు గోపాల్, బెక్కెం బబిత నిర్మిస్తున్న కొత్త చిత్రంలో ప్రదీప్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం భిన్నమైన కథాంశంతో రూపొందించబడుతోంది. కాగా, అల్లూరి అనే పవర్ ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ రిలీజైంది.

 ”ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ప్ చుప్‌.. పోలీస్ బ‌య‌ల్దేరాడు రా” అనే డైలాగ్ తో టీజ‌ర్ మొద‌లైంది. టీజ‌ర్‌లో చాలా షాట్లు ప‌డ్డాయి. అయితే ఏ ఒక్క‌రి క్యారెక్ట‌రు పూర్తిగా రివీల్ చేయ‌లేదు. చైత‌న్యానికి నాంది, విప్ల‌వానికి పునాది.. నిజాయ‌తీకి మారు పేరు.. అంటూ.. ‘అల్లూరి’ పాత్ర‌ని ప‌రిచ‌యం చేశారు. పోలీస్ గెట‌ప్ లో శ్రీ‌విష్ణు లుక్ అదిరేటట్లు  ఉంది. టీజర్ చూస్తూంటే...1990 బ్యాక్ డ్రాప్‌లో జ‌రిగిన క‌థ‌లా,  న‌క్స‌ల్ ఉద్య‌మాన్నీ ట‌చ్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ”అల్లూరి సీతారామ‌రాజు, స‌బ్ ఇన‌స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్” అంటూ ప‌వ‌ర్ ఫుల్ గా డైలాగ్ చెప్ప‌డం, చుట్టూ ఉన్న ఇర‌వై మంది న‌క్స‌లైట్లు శ్రీ‌విష్ణుకి గ‌న్నులు గురి పెట్ట‌డంతో టీజ‌ర్ పూర్త‌య్యింది. 

 

టీజర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) మాట్లాడుతూ.. అల్లూరి 125వ జయంతి రోజున తన చిత్రం టీజర్ రిలీజ్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తాను అల్లూరిని చూడకపోయినా.. ఆయన పేరు పెట్టుకున్న ఈ సినిమాలో నిజాయితీగా నటించానని చెప్పారు. కెరీర్ లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం ఆనందంగా ఉందన్నారు. 

పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందించబడుతున్న ఈ చిత్రంలో సిన్సియర్ పోలీసుగా ఉన్నాడు. యూనిఫామ్ లో కనిపించిన విధంగా సినిమాలో అతని పేరు ఎ.ఎస్. రామరాజు. ఇది గొప్ప పోలీసు ఆఫీసర్ కథ, ఇంతవరకు శ్రీవిష్ణు చేయనటువంటి పోలీసుగా కనిపించనున్నారు.  ఒక పాట మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. శ్రీవిష్ణు సరసన కయ్యదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

ధర్మేంద్ర కాకరాల ఎడిటర్. నాగార్జున వడ్డే (అర్జున్), ఎం విజయ లక్ష్మి మరియు గంజి రమ్య సహ నిర్మాతలు. అల్లూరి షూటింగ్ చివరి దశలో ఉంది మరియు త్వరలో మేకర్స్ విడుదల తేదీని ప్రకటిస్తారు. తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్ , రవివర్మ, మధుసూధన్ రావు, జయవాణి తదితరులు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios