Asianet News TeluguAsianet News Telugu

ఈ సినిమాతోనే తెలుగు థియోటర్స్ రీ ఓపెన్

ఈ పరిస్దితుల్లో తమ సినిమాను విడుదల చేస్తే ఆర్ధికంగా బాగా నష్టపోతామంటూ నిర్మాతలు సినిమాలను విడుదల చేయడం లేదు.  అయితే ఆగస్ట్ నుంచి సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్దితి కనపడుతోంది. అప్పటికి ఉభయగోదావరి జిల్లాల్లోనూ పూర్తి కర్ఫూ ఎత్తేస్తారు. 

SR Kalyana Mandapam Release After Theaters Re-Opening jsp
Author
Hyderabad, First Published Jul 6, 2021, 4:43 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలను మరింత సడలించిన సంగతి తెలిసిందే. ఈ నెల 8వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, ఫంక్షన్‌ హాళ్లు మరో రెండు రోజుల్లో తెరచుకోనున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే, కర్ఫ్యూ సడలింపు సమయంలో వీటిని తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్‌పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరో ప్రక్క తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 20 తేది నుంచి సంపూర్ణంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. 

కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఎవరి పనులు వారి చేసుకునే విధంగా అనుమతిచ్చింది. అయితే థియోటర్ కు జనం ధైర్యంగా వస్తారో రారో తెలియని పరిస్దితి. సెకండ్ వేవ్ లో మరణాలు బాగా పెరిగిపోవటంతో చాలా మందిలో ఇంకా భయాందోళనలు ఇంకా తొలిగిపోలేదు. ఈ నేపధ్యంలో కోట్లు వెచ్చించి సినిమాలు నిర్మించిన సినీ నిర్మాతలు తమ సినిమాలు వెంటనే రిలీజ్ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ పరిస్దితుల్లో తమ సినిమాను విడుదల చేస్తే ఆర్ధికంగా బాగా నష్టపోతామంటూ నిర్మాతలు సినిమాలను విడుదల చేయడం లేదు.  అయితే ఆగస్ట్ నుంచి సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్దితి కనపడుతోంది. అప్పటికి ఉభయగోదావరి జిల్లాల్లోనూ పూర్తి కర్ఫూ ఎత్తేస్తారు. 

ఈ క్రమంలో ఆగస్ట్ 6 న ‘ఎస్.ఆర్‌.క‌ల్యాణ‌మండ‌పం’. సినిమా రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.‘రాజావారు రాణీవారు’ చిత్రంతో ఆక‌ట్టుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా శ్రీధ‌ర్ గాదె తెర‌కెక్కిస్తున్నారు. ప్రియాంక జ‌వాల్క‌ర్ నాయిక‌. సాయి కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించే (థియేట‌ర్‌) హ‌క్కుల్ని శంక‌ర్ పిక్చ‌ర్స్‌ సంస్థ సొంతం చేసుకుంది.  ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చైత‌న్య భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న‌ ఈ చిత్రం కరోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios