నిఖిల్ లేటెస్ట్ మూవీ స్పై. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా టీజర్ విడుదల చేశారు.
కార్తికేయ 2తో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నాడు నిఖిల్. ఆయన మార్కెట్ పెరిగిన నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నారు. కార్తికేయ 2తో అబ్బురపరిచిన నిఖిల్ ఈసారి స్పై గా థ్రిల్ చేయనున్నారు. స్పై టీజర్ ఢిల్లీలోని కర్తవ్య పథ్ నేతాజీ స్టాట్యూ వద్ద లాంచ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సబ్జెక్టు ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో టీజర్ లాంచ్ కి కర్తవ్య పథ్ ని ఎంచుకున్నట్లు నిఖిల్ అన్నారు.
ఒకటిన్నర నిమిషాల నిడివి కలిగిన టీజర్ ఆకట్టుకుంది. యాక్షన్, సస్పెన్సు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగింది. టీజర్ లో కథపై హింట్ ఇచ్చేశారు. 1945లో కనపడకుండా పోయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చుట్టూ స్పై మూవీ నడుస్తుంది. చంద్రబోస్ మరణం పెద్ద మిస్టరీ. అనేక వాదనలు వినిపించాయి. నిజం ఏమిటనేది ఎవరికీ తెలియదు. ఇండియన్ గవర్నమెంట్ కి తెలిసినా బయటపెట్టలేదనే మరో వాదన కూడా ఉంది. ఈ సబ్జెక్టు పై తెలుగులో చిత్రాలు వచ్చిన దాఖలాలు లేవు.
ఇక స్పై మూవీలో హీరో ఆయన మరణం ఎందుకు రహస్యంగా ఉంచబడిందని చేధించే ప్రయత్నం చేస్తాడు. ఫైనల్ గా హీరోకి తెలిసిన నిజం ఏమిటీ. వాస్తవాలు తెలుసుకునే క్రమంలో హీరో పడ్డ కష్టాల సమాహారమే స్పై మూవీ. గ్యారీ బి హెచ్ ఈ చిత్ర దర్శకుడు. ఈ మల్టీ టాలెంటెడ్ ఫెలో దర్శకుడిగా భారీ స్పై థ్రిల్లర్ చేస్తున్నారు. మకరంద్ దేశ్ పాండే కీలక రోల్ చేశారు.
జూన్ 29న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఐశ్వర్య మీనన్ నిఖిల్ కి జంటగా నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకల, విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.
