ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్.. ఇక ఓటీటీ గుమ్మం తొక్కబోతోంది ప్రపంచ వ్యాప్తంగా ఊపు ఊపిన సినిమా డిజిటల్ గుమ్మంత తొక్కడానికి డేట్ ఫిక్స్ అయ్యింది.
ఇండియాలో కోన్ని హాలీవుడ్ మూవీస్ కు ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా స్పైడర్ మ్యన్, అవేంజర్స్, జేమ్స్ బాండ్ లాంటి హాలీవుడ్ మూవీస్ కు మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ. అంతే కాదు.. భారీగా కలెక్షన్స్ కూడా వస్తాయి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ నో వే హెమ్ కూడా అంతకు మించి అన్న రీతిలో వసూళ్లు సాధించింది.
టామ్ హాలండ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. గతేడాది డిసెంబర్ 16న యూఎస్ కంటే ఒక రోజుమందే ఇండియాలో రిలీజ్ అయిన సినిమా ఇక్కడ కూడా దుమ్మురేపింది. మొదటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటివరకు స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో వచ్చిన కథలను, క్యారెక్టర్లను కనెక్ట్ చేస్తూ ఒక సినిమాగా తీయడమనేది సినీ చరిత్రలోనే లేదు.
ఈ విషయంలో జాన్‌వాట్ ఫుల్ సక్సెస్ అయ్యాడు. జాన్ వాట్ తన దర్శకత్వంతో ప్రేక్షకులను థియేరర్లలో కట్టిపడేసాడు. సినిమా చివర్లో ప్రతి క్యారెక్టర్‌కు ఒక జస్టిఫికేషన్ ఇచ్చాడు.స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఇండియాలో 200 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల డాలర్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి హాలీవుడ్ సినిమాల్లో 5వ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం టామ్ హాలండ్ స్పైడర్‌మ్యాన్ సిరీస్‌లలో బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. అవేంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్ హీరో ఫిలిం కూడా ఇదే.
మరి థియేటర్లలో అదరగొట్టిన ఈసినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
