లెజండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకటంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారింది. ఆ నెల 11న తనకు కరోనా సోకినట్టుగా ప్రకటించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయితే గత నాలుగైదు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో చెన్నైలోని ఎమ్జీఎం ఆసుపత్రి వైధ్యులు ఆయన్ను ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ అభిమానులు సినీ ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు ఎస్పీ సోదరి, ప్రముఖ గాయని శైలజ ప్రకటించారు. గత ఐదు రోజులుగా వెంటిలెటర్ మీద ఉన్న ఎస్పీకి ఈ రోజు వెంటిలెటర్‌ను తొలగించినట్టుగా ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి లైఫ్ సపోర్ట్ లేకుండా శ్వాస తీసుకుంటున్నారని ఆమె తెలిపారు. అయితే ఇంకా చికిత్స కొనసాగుతుందని, ఆయన స్ఫృహలోనే ఉన్నారని ఆమె వెల్లడించారు.

దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన ఆరోగ్య కుదటపడుతుందని తెలియటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆయన పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీబీ ఆరోగ్యం తిరిగి రావాలంటూ ప్రార్థన చేసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.