కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఎప్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. ఈ రోజు ఆయనకు నిర్వహించిన కరోనా టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చినట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని, ఇప్పటికీ ఆయనకు ఎక్మో సపోర్ట్‌తోనే ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టుగా వెల్లడించారు.

ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పీ  చరణ్ అధికారికంగా వెల్లడించారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్ధలను చేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గత రెండు రోజులుగా ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగా ఉందన్నవార్తలు రావటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొద్ది సేపటికే ఈ వార్తలు అవాస్తవం అంటూ క్లారిటీ ఇచ్చారు ఎస్పీ చరణ్‌. ఎస్పీకి కరోనా టెస్ట్‌లో నెగెటివ్‌ రాలేదని, పుకార్లను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు.

3 వారాల క్రితం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనకు కరోనా సోకినట్టు గా స్వయంగా వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు. కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆయన వయసు, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన పరిస్థితి విషమించింది.