కరోనా వైరస్..శరవేగంగా విస్తరిస్తోంది.  ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు  దాకా అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. రీసెంట్ గా గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా ఎస్పీబీ అభిమానులకు తెలియజేశారు. దాంతో ఆయనకు ఎలా ఉంది..కోలుకుంటున్నారా అనే విషయాలపై హెల్త్ బులిటిన్ విడుదల చేసారు. 

ప్రస్తుతం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఎస్పీబీ కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆ హాస్పిటల్ డాక్టర్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హెల్త్ కండిషన్ పై బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు.