ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిట్స్ లలో గత కొన్నేళ్ల వరకు బాలీవుడ్ హవా ఎక్కువగా ఉండేది. అయితే కాలం పరిగెడుతున్న కొద్దీ బాక్స్ ఆఫీస్ రేస్ లో మన సౌత్ సినిమాల లిస్ట్ కూడా గట్టిగానే పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాలు ఎవరు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటున్నాయి. 

కోలీవుడ్ లో రోబో మొదలు పెట్టిన 250 కోట్ల మార్క్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. 250 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం అంటే సౌత్ సినిమాలకు ఇప్పుడు చాలా ఈజీగానే మారింది. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలవుతోంది. రీసెంట్ గా విజయ్ సర్కార్ సినిమాతో ఇప్పటివరకు 6 సౌత్ సినిమాకు 250 కోట్ల బాక్స్ ఆఫీస్ లిస్ట్ లో ఉన్నాయి. 

రోబో తరువాత బాహుబలి 1 ఊహించినట్టుగానే ఆ రికార్డ్ ను అందుకోగా ఆ తరువాత కబాలి ఎవరు ఊహించని విధంగా యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ 250 కోట్లను దాటేసింది. అనంతరం బాహుబలి సీక్వెల్ అంతకంటే ఎక్కువ స్థాయిలోనే చాలా సునాయాసంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసి 250 క్లబ్ ని దాటేసింది. 

ఇక విజయ్ మెర్సల్ తో పాటు రీసెంట్ గా వచ్చిన సర్కార్ సినిమాలు ఈ రికార్డ్ ను అందుకొని బాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ధీటుగా నిలిచాయి. ఇక ఇప్పుడు రోబో కి సీక్వెల్ గా వస్తోన్న 2.0 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కూడా 250 కోట్ల కంటే ఎక్కువ టార్గెట్ ను సెట్ చేసే అవకాశం ఉంది. దాదాపు వరల్డ్ వైడ్ గా 10 వేల స్క్రీన్స్ లలో రిలీజ్ కానుంది అంటే మొదటి వారంలోనే ఈజీగా ఆ క్లబ్ ని క్రాస్ చేసే అవకాశం ఉంది.