సౌత్ సినిమా.. ముఖ్యంగా తమిళ సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన మొదటి దర్శకుడు శంకర్. రాజమౌళి వచ్చాక కాస్త డౌన్ అయిన ఈ స్టార్ మేకర్ అరుదైన గౌరవాన్ని సాధించాడు.
తమిళ సినిమా తో పాటు సౌత్ సినిమాకు ఒక గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో శంకర్ కూడా ఒకరు. ఈ స్టార్ మేకర్ తన టాలెంట్ తో మన సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాడు. ఈ మద్య వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తూ.. కాస్త డౌన్ అయిన శంకర్.. రాజమౌళి రాకతో ఇంకాస్త తగ్గారు. అయినా సరే తన సినిమాలు తాను చేసుకుంటూ.. ఇమేజ్ ను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు.
జెంటిల్‌మెన్‌తో మొదలు పెట్టి.. ఒకే ఒక్కడు, జీన్స్, బాయ్స్, శివాజీ, భారతీయుడు, రోబో, ఐ లాంటి అంద్భుతాలు సుష్టించాడు శంకర్. ప్రసుతుతం ఆయన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇక విషయం ఏంటీ అంటే.. ఈ జీనియస్ డైరెక్టర్ తన కెరీర్ ను స్టార్ట్ చేసి 30 ఏళ్లు అవుతుంది. మూవీ కెరీర్ లో ముప్పై ఏళ్ళ మైలురాయిను టచ్ చేసిన సందర్భంగా ఆయనకు వేల్స్ ఇంజినీరింగ్, రీసెర్చ్ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.
శుక్రవారం పల్లావరంలోని యూనివర్సిటీ క్యాంపస్ లో జరిగిన 12వ వార్షికోత్సవంలో ఈ గౌరవాన్ని ఆయన అందు కున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు.అనంతరం వివిధ రంగాలలో విశేష సేవలందించిన ప్రముఖులను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. అందులో దర్శకుడు శంకర్, అణు శాస్త్ర విజ్ఞాన కేంద్రం డైరక్టర్ అజిత్‌కుమార్ మొహతీ, భారతీయ క్రికెట్ క్రీడాకారుడు సురేష్ రైనా, నాటి జూన్ బ్లూ గ్రూప్ అధ్యక్షుడు విక్రమ్ అగర్వాల్ గౌరవ డాక్టరేట్ పురస్కారాలు అందుకున్నారు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న శంకర్.. ఆతరువాత వరుసగా తన సినిమాలు లైన్ లో రెడీగా పెట్టుకున్నారు. కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన ఇండియన్ 2 సినిమాను షూటింగ్ రీ ఓపెన్ చేయబోతున్నారు. కమల్ హాసన్ అదే పనిలో మేక్ ఓవర్ అవ్వడానికి అమెరికా వెళ్ళారు. ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో అపరిచితుడు సినిమాను రణ్ వీర్ సింగ్ తో రీమేక్ చేయబోతున్నాడు శంకర్. ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్ అవ్వడమే తరువాయి.
