Asianet News TeluguAsianet News Telugu

సినిమావాళ్లు మరీ ఇలా బరితెగిస్తున్నారే..! ఎవరితో ఎవరికి అక్రమసంబంధం...

సినిమా ఇండస్ట్రీలో ఇటీవల అక్రమ సంబంధం వ్యవహారాలు మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా దర్శన్ - పవిత్ర గౌడ వ్యవహరంతో సినిమావాళ్లపై ప్రజల్లో నీచమైన అభిప్రాయం ఏర్పడింది. ఇలా సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు వివాదాస్పదమైన అక్రమ వ్యవహారాలు ఏవంటే... 

South Indian film actors extra marital affairs AKP
Author
First Published Jun 20, 2024, 11:16 PM IST

హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీ అంటే అదో రంగుల ప్రపంచం. సినిమావాళ్లంటే సామాన్య ప్రజల్లా కాదు... కాస్త భిన్నంగా వుంటారని తెలుసు. సినిమావాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తాము అభిమానించే నటులను అన్నిట్లోనూ ఆదర్శంగా తీసుకుంటుంటారు అభిమానులు. ఇలా సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో వున్న సినిమావాళ్ళు ఈ మధ్యకాలంలో మరీ బరితెగిస్తున్నారు. డ్రగ్స్ నుండి అక్రమ సంబంధాల వరకు అన్నిట్లోనూ సినీ, సీరియల్ నటుల పేర్లు వినిపిస్తున్నారు. ఇలా కొందరు నటీనటులు చేసే పనులు మొత్తం సినీ ఇండస్ట్రీకే చెడ్డపేరు తెస్తున్నాయి.

ఇటీవల సినిమావాళ్ళ అక్రమసంబంధాలు మరి ఎక్కువైపోయాయి. పెళ్ళయి హాయిగా భార్యాబిడ్డలతో జీవిస్తున్న సినిమావాళ్ల పేర్లు కూడా అక్రమసంబంధాల వివాదాల్లో వినిపిస్తున్నాయి. ఇలా లేటువయసులో ప్రేమాయణం సాగిస్తున్న నరేష్-పవిత్ర నుండి   దర్శన్-పవిత్రల వరకు సినిమావాళ్ల చిత్రవిచిత్ర వివాదాలపై ఓ లుక్కేద్దా. 

నరేష్-పవిత్ర : 

ఒకప్పటి హీరో... ప్రస్తుతం మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపుపొందిన నరేష్ పెళ్లిళ్ల వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. అతడు తోటి నటి పవిత్రా లోకేష్ తో ప్రేమాయణం సాగించారు. అయితే గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బైటపెట్టారు. దీంతో నరేష్-పవిత్రల బంధం హాట్ టాపిక్ మారింది. 

ఎంతో వివాదం నడిచిన తర్వాత నరేష్, పవిత్ర కూడా ఓపెన్ అయిపోయారు. గతంలో రహస్యంగా కలిసే వీరిద్దరూ ప్రస్తుతం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీరిది బంధం ఏమిటో తెలీదుగానీ ఇద్దరు కలిసే వుంటున్నారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్, భర్తతో విడిపోయిన పవిత్రలు లేటు వయసులో సాగించిన ప్రేమాయణం   తెలుగు, కన్నడ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 

దర్శన్-పవిత్ర :

కన్నడ హీరో దర్శన్-పవిత్ర గౌడ వ్యవహారం ఇప్పుడు కర్ణాటకలోనే కాదు యావత్ దేశంలో హాట్ టాపిక్. ఓ మర్డర్ కేసులో దర్శన్ అరెస్ట్ తో అతడితో పవిత్ర గౌడ ఘాటు ప్రేమాయణం వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రియురాలి కోసం ఓ హత్య చేసి ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు దర్శన్. 

హీరో దర్శన్ కు విజయలక్ష్మితో పెళ్లికాగా వీరికి వీనీష్ అనే కొడుకు కూడా వున్నారు. ఇక పవిత్ర గౌడకు కూడా ఉత్తర ప్రదేశ్ కు చెందిన సంజయ్ సింగ్ తో వివాహం అయ్యింది. వీరికి యుక్త వయసులో వున్న కూతురు కూడా వుంది. అయితే భర్తతో విబేధాల కారణంగా విడాకులు తీసుకున్న పవిత్ర సినిమాల ద్వారా పరిచయమైన దర్శన్ కు దగ్గరయ్యారు. ఇలా చాలాకాలంగా సాగుతున్న వీరి వ్యవహారం తాజా మర్డర్ తో భయటపడింది. 

యువ రాజ్ కుమార్ - సప్తమి గౌడ  

ఇక ఇదే కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన మరో హీరో హీరోయిన్ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ మరవడు, హీరో యువ రాజ్ కుమార్ కాంతారా హీరోయిన్ సప్తమి గౌడతో అక్రమ సంబంధాన్ని నడుపుతున్నాడట. ఈ విషయాన్ని రాజ్ కుమార్ భార్య శ్రీదేవి బైరప్ప బైటపెట్టారు. 

యువ రాజ్ కుమార్, శ్రీదేవి బైరప్ప భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య విబేధాల కారణంగా విడాకులకు సిద్దమయ్యారు... ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో వుంది. ఈ క్రమంలోనే తన భర్తకు హీరోయిన్ సప్తమి గౌడతో అక్రమ సంబంధం వుందంటూ శ్రీదేవి చేస్తున్న ఆరోపణలు కన్నడ సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి. అయితే తనకు యువ రాజ్ కుమార్ తో ఎలాంటి సంబంధం లేదని... శ్రీదేవి చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని సప్తమి గౌడ అంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios