సూపర్ స్టార్ రజినీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ తో ఆమె పరిచయం పెళ్లికి దారితీసింది. 

సూపర్ స్టార్ రజినీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త విషాగన్ తో ఆమె పరిచయం పెళ్లికి దారితీసింది. వీరి వివాహం చెన్నైలోని లీలా ప్యాలెస్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

సోమవారం ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల మధ్య వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, స్టాలిన్, కమల్ హాసన్, మోహన్ బాబు, సుబ్బిరామి రెడ్డి, అనిరుద్, రాఘవ లారెన్స్, మణిరత్నం, ఆండ్రియా, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

వీరికి రజినీకాంత్ పెద్ద అల్లుడు ధనుష్ స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు సాగిన పెళ్లి హడావిడిలో సంగీత్, మెహెందీ అంటూ చాలా వేడుకలను నిర్వహించారు

View post on Instagram

View post on Instagram

View post on Instagram
View post on Instagram

View post on Instagram