మరొక్కసారి గొప్పమనసు చాటుకున్నారు రీల్ విలన్.. రియల్ హీరో సోనూసూద్. ఓపేద కళాకారుడి ఇంట్లో వెలుగులు నింపాడు. బయటకు వస్తుందో రాదో అనుకుని.. ఇంట్లోనే దాగి ఉన్న గొంతును.. బాలీవుడ్ సినిమాలో వినిపించబోతున్నాడు. 


రీల్ విలన్ కాస్త రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. చేతికి ఎముకలేదన్నంతగా దానాలు చేస్తూ.. ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపిన ఈ బాలీవుడ్ హీరో.. ఆ మధ్య దీన స్థితలో ఉన్న ఓ వృద్థ కళాకారుడిని ఆదుకుని మంచి మరసు చాటుకున్నాడు. ఇప్పుడు మరో పేద కళాకారుడికి అద్భుతమైన అవకాశం ఇచ్చి ఆదుకున్నాడు. ఇలా చాలా మంది జనాలు దేవుడిగా భావించే సోనూసూద్.. నలుగురికి ఆదర్శంగా మారాడు. 

ఇక వివరాల్లోకి వెళ్తూ.. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అమర్‌జీత్ జైకర్‌ మంచి సింగర్. అతని పాటలకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఈక్రమంలో పల్లె వరకూ పరిమితం అయిన అతని పాటను వెలుగులోకి తీసుకువచ్చేవారు కరువయ్యారు. అయితే అనుకోకుండా ఈ వ్యాక్తికి ఊహించని అదృష్టం వచ్చి తలుపు తట్టింది. ఇటుకబట్టీ కార్మికుడైన అమర్‌జీత్‌కు పాటలు పాడడమంటే ఎంతో ఇష్టం. బాలీవుడ్ పాటలు పాడుతూ వాటిని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఉంటాడు. ఈక్రమంలోనే రీసెంట్ గా అతను పాడిన దిల్ దే దియా హై పాట అతను పాడిన విధానాన్ని వీడియోగా చేసి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. 

ఇక అమర్ జిత్ పాట ట్విట్టర్‌ను కుదిపేసింది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అతని ఫ్యాన్స్ అయ్యారు. అంతే కాదు ఈ వీడియోను దాదాపు 10 లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోను చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్, నటి నీతూ చంద్ర, ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ సహా పలువురు ప్రముఖులు అమర్‌జీత్‌ను ప్రశంసిస్తూ వీడియోను రీ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆపద్భాందవుడిగా పేరు పొందిన సోనూ సూద్ అయితే ఒక అడుగు ముందుకు వేసి.. అతని నెంబర్ సాధించి అతనితో మాట్లాడాడు. సోనూతో పాటు నీతూచంద్ర కూడాబఅతడి ఫోన్ నంబరు తీసుకుని మాట్లాడారు.

Scroll to load tweet…

అంతే కాదు ఆ పేద కళాకారుడికి పెద్ద అవకాశం కల్పించారు సోనూసూద్. ప్రస్తుతం సోనూ నటిస్తున్న ఫతే సినిమాలో అతడికి పాడే అవకాశాన్ని కూడా కల్పించారు. బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అమర్‌జీత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోనూ సూద్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న అమర్‌జీత్ మీ ప్రేమాభిమానాలు తనకు ఇలాగే ఉండాలని కోరుకున్నాడు. ఈ విషయంలో సోనూసూద్ ను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారునెటిజన్లు. నిజంగా దేవుడివంటూ పొగిడేస్తున్నారు. 

గతంలో కూడా కరోనా బాధితులను సొంత ఖర్చులతో ఆదుకున్నాడు సోనూ సూద్. బాగా చదువుతూ.. ఆర్ధిక ఇబ్బందులతో చదువు మానేసిన వారిని సొంత ఖర్చులతో చదివిస్తున్నాడు. ఇక ఇలాంటి ఎన్నో సేవాకార్యక్రమంల తో ప్రజల పాలిట దేవుడిలా మారిపోయాడు సోనూసూద్. అంతే కాదు దేశవ్యావప్తంగా సోనూసూద్ కు గుళ్ళు కూడా కడుతున్నారు ఫ్యాన్స్.