నటుడు సోనూ సూద్ వయసు 47ఏళ్ళు, అంటే మరో మూడేళ్ళలో ఆయన అర్థ సెంచరీకి రీచ్ కానున్నాడు. అయినప్పటికీ సోనూ సూద్ పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ బాడీ మైంటైన్ చేస్తున్నారు. ప్యూర్ వెజిటేరియన్ అయిన సోనూ సూద్ ఫిట్నెస్ అండ్ బాడీ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు, ఆహారం విషయంలో ఆరోగ్యకరమైన నియమాలు పాటిస్తాడు. 


సోనూ సూద్ అంటే కరుడుగట్టిన విలన్ పాత్రలకు ఫేమస్ కాబట్టి, దర్శక నిర్మాతల అవసరాలకు అనుగుణంగా మంచి బాడీ ఆయన మైంటైన్ చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ నుండి సోనూ సూద్ సిక్స్ ప్యాక్ బాడీలో కనిపిస్తున్నారు. సినిమా అంటే పిచ్చిగా ప్రేమించే సోనూ సూద్,  దక్కిన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తారు. సోనూ సూద్ నటించిన అల్లుడు అదుర్స్ సంక్రాంతి కానుకగా విడుదల కావడం జరిగింది. 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరక్కిస్తున్న ఆచార్య మూవీలో సోనూ సూద్ కీలక రోల్ చేస్తున్నారు. ఇక కరోనా సమయంలో సోనూ సూద్ పేద ప్రజలకు చేసిన సేవలు దేశవ్యాప్తంగా పాప్యులర్ అయ్యాయి. సోనూ సూద్ రియల్ హీరో అంటూ దేశ ప్రజలు ఆయన్ని కొనియాడుతున్నారు. పేదల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన సోనూ సూద్ ని దేవుడంటూ కొలుస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)