ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ రియాల్‌ హీరో అనిపించుకుంటున్న సోనూ సూద్‌ ఇప్పుడు సాయం కోరుతున్నారు. అర్జెంట్‌గా బ్లడ్‌ కావాలని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. సిరిసిల్లాకు చెందిన ఓ నాలుగు నెలల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్‌కి ఏడు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పగా, అంత మొత్తం లేదని చిన్నారి అద్వౌత్‌ శౌర్య తండ్రి పందిపెల్లి బాబు సాయం కోరారు. అది కాస్త సోనూ సూద్‌కి తెలియడంతో ఖర్చుల్లో అధిక భాగం తాను భరిస్తానని తెలిపారు. 

తాను సూచించిన ఆసుపత్రిలో చికిత్స ఇన్నోవా ఆసుపత్రిలో చిన్నారికి వైద్య చికిత్స చేయించాలని పేర్కొన్నాడు. ఆపరేషన్‌ డాక్టర్‌ కోన సాంబమూర్తి చేస్తారని సోనూసూద్‌ చెప్పినట్టు శౌర్య తండ్రి బాబు వెల్లడించాడు.  ఏడు లక్షల్లో సోనూ సూద్‌ అధిక భాగం సోసూసూద్‌ చెల్లించనున్నాడు. అయితే ఇప్పుడు ఆ బాబుకి బ్లడ్‌ కావాల్సి వచ్చింది. బి-నెగటివ్‌ బ్లడ్‌ కావాలని తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన చెబుతూ, `మేం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాలుగు నెలల అద్వౌత్‌ను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం. వెంటనే బి- నెగటివ్‌ బ్లడ్‌ కావాలి. దయచేసి ఈ గ్రూప్‌ వ్యక్తులు ఎవరైనా ముందుకు వచ్చి రక్తదానం చేయగలరు. ఆరు యూనిట్ల బ్లడ్‌ కావాలన్నారు` అని సోనూ సూద్‌ తెలిపారు.