మురారి - ఖడ్గం సినిమాలతో టాలీవుడ్ కి బాగా దగ్గరైన నటి సోనాలి బింద్రే. ఇక శంకర్ దాదా MBBS బాలీవుడ్ లో పెద్ద అవకాశాలను అందుకొని కొన్నేళ్ల వరకు ఓటమే లేని హీరోయిన్ గా కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేసింది. అయితే ఇటీవల సోనాలి క్యాన్సర్ తో పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. 

చివరిదశలో ఉండగా తనకు క్యాన్సర్ ఉందని తెలుసుకున్న ఈ నటికి బతికే అవకాశం చాలా తక్కువని డాక్టర్లు చెప్పేశారట. దాదాపు 70%శాతం ఆమె మరణించే పరిస్థితిలో ఉన్నట్లు తెలుసుకున్నారట. కానీ చివరివరకు తాను మానసిక ధైర్యంతో ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సోనాలి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తన రెగ్యులర్ జీవితాన్ని సంతోషంగా గడపడమే కాకుండా క్యాన్సర్ బాధితులలో ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నారు. రీసెంట్ గా సోనాలి తన క్యాన్సర్ పై ఈ విధంగా స్పందించింది. 

చివరగా నాలుగో దశలో ఉండగా నాకు క్యాన్సర్ గురించి తెలిసింది. నా భర్త గోల్డి బెహెల్ వెంటనే నన్ను న్యూ యార్క్ కి వెళ్లాలని సూచించారు. నాకు అప్పుడు ఇష్టం లేదు. ఇక్కడే వైద్యం చేయించుకుంటా అని చెప్పినా ఆయన వినలేదు. కానీ అక్కడికి వెళ్లిన తరువాత డాక్టర్స్ క్యాన్సర్ చివరి దశలో ఉందని 30%శాతం మాత్రమే బ్రతికే అవకాశం ఉందని  అన్నారు. అప్పుడు తన భర్త ఆలోచనని అర్ధం చేసుకున్నట్లు సోనాలి తెలియజేశారు.