సోనాక్షి సిన్హా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. దబాంగ్ చిత్రం తర్వాత ఈ హీరోయిన్ యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నచ్చేసింది. ప్రస్తుతం సోనాక్షి సిన్హా నటించిన 'ఖందాని షఫాఖానా' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో సోనాక్షి సిన్హా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. 

శిల్పి దాస్ గుప్తా ఈ చిత్రానికి ఈ చిత్రానికి దర్శకురాలు. సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. మరణించిన తన అంకుల్ సెక్స్ హాస్పిటల్ ని టేకప్ చేసే యువతి పాత్రలో సోనాక్షి ఈ చిత్రంలో నటిస్తోంది. సోనాక్షి మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని కథాంశం అందరికి సంబంధించినది, ముఖ్యమైనది కూడా. అందుకే ఈ చిత్రంలో నటించా. చాలా మంది సిగ్గుతో శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడరు. ఈ చిత్రం చూసిన వారందరికీ శృంగారం గురించి చర్చించే ధైర్యం వస్తుంది అనుకుంటున్నా. 

శృంగారం ప్రతి ఒక్కరి జీవితంలో కాబట్టి దాని గురించి అందరూ మాట్లాడుకోవాలి అని సోనాక్షి తెలిపింది. ధైర్యంగా మాట్లాడినప్పుడే శృంగార పరమైన సమస్యలు తీరుతాయని దర్శకురాలు శిల్పి తెలిపారు. చాలా రాష్ట్రాల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ని కూడా తొలగించారని, ఇది మంచి పద్దతి కాదని ఆమె అన్నారు.