బాలీవుడ్ సింగర్ సోనా మహాపాత్ర గతంలో సల్మాన్ పై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 'భారత్' సినిమా నుండి ప్రియాంకా తప్పుకుందని సల్మాన్ ఆమెపై సెటైర్లు వేయడంతో సోనా సోషల్ మీడియా వేదికగా సల్మాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో అతడి అభిమానుల నుండి బెదిరింపులు వచ్చినా.. వెనక్కి తగ్గలేదు. తాజాగా మరోసారి సల్మాన్ పై మండిపడింది. ఈసారి సల్మాన్ ఖాన్ ని ఏకంగా 'పేపర్ టైగర్' అని అభివర్ణించి షాక్ ఇచ్చింది. సల్మాన్ తాజా చిత్రం 'భారత్' సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది.

సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' సినిమాకు హైప్, భారీ ప్రమోషన్ కల్పించినా.. కనీసం ఒక వారం పాటు కూడా వసూళ్లు తీసుకురాలేకపోయిందని, ఇలాంటి ఫిలిం స్టార్లను ఏమని పిలవాలని..? అడిగింది. అంతేకాదు.. అతడిని 'పేపర్ టైగర్' అని అభివర్ణిస్తూ.. ఇటువంటి వారిని పూజించడం మానుకోవాలని సలహా ఇచ్చింది.

ఇది చూసిన సల్మాన్ అభిమానులు.. ముందు నువ్ మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకో ఆ తరువాత పక్కన వాళ్ల మీద కామెంట్ చెయ్ అంటూ గడ్డిపెడుతున్నారు. పబ్లిసిటీ కోసం సల్మాన్ పై విమర్శలు చేస్తుందని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.