దేశంలో కరోనా సెకండ్ వేవ్ జోరు కొనసాగుతుంది.భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటోంది.  హఠాత్తుగా సీరియస్ అయ్యే కేసులు, ఆక్సిజన్ అందకపోవటం, ఐసీయూ లో బెడ్ అందుబాటులో లేకపోవటం వంటి వాటితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా  ఐసీయూ అందుబాటులో లేక ఓ ప్రముఖ దర్శకుడు తన తల్లినే కోల్పోవాల్సి వచ్చింది.

సాయి థరమ్ తేజ హీరోగా వచ్చిన `సోలో బ్రతుకే సో బెటర్` డైరెక్టర్ సుబ్బు తన తల్లిని కోల్పోయిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీ అందరినీ షాక్ కి గురి చేసింది.  `సోలో బ్రతుకే సో బెటర్` అనే చిత్రాన్ని తీసి కరోనా ఫస్ట్ వేవ్ తరువాత థియేటర్స్ లో తొలి సక్సెస్ ని అందించాడు. మొదటి వేవ్ లో పరిశ్రమకు ధైర్యం నింపిన తొలి సినిమాని ఇచ్చిన రికార్డ్ ఈ డైరక్టర్ ఖాతాలో ఉంది. అయితే దర్శకుడు సుబ్బు తల్లిగారు శ్రీ మంగమ్మ గారు నిన్న రాత్రి కరోనాతో మృతి చెందారు. 
https://twitter.com/IamSaiDharamTej/status/1393998326085799936

డైరక్టర్ సుబ్బు తల్లిగారు కేవలం ఐసీయూ అందుబాటులో లేకనే చనిపోయారనేది బంధుమిత్రులనే కాదు.. సహచరులను ఎంతగానో కలచివేస్తోంది.కొద్ది రోజుల క్రితం ప్రముఖ నటి ఆస్పత్రి ముందే బతిమాలుకున్నా తమ్ముడిని రక్షించుకోలేకపోలేని పరిస్దితి. రీసెంట్ గా సప్తగిరి లక్ష సాయం చేసినా తన స్నేహితుడైన దర్శకుడు నంధ్యాల రవిని బతికించుకోలేకపోయారు. ఇలాంటి చావులు హృదయవిదాకంగా కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. ఇలా ఎన్నాళ్లు సాగుతుందో ఈ మరణ మృదంగం.