సోషల్ మీడియాలోకి సెలబ్రిటీలు వచ్చిన తర్వాత అభిమానులకు వారిని చేరుకోవడం దగ్గరైంది. తమ తారల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. మరోవైపు ఆయా స్టార్స్ కు కూడా దీన్ని ఓ చక్కని సంపాదన మార్గంగా మలుచుకుంటున్నారు. కొందరు భారీగాను.. కొందరు కొన్ని ఖర్చుల వరకూ సంపాదించుకంటున్నారు. ఇంతవరకూ ఓకే అయినా.. నాణేనికి రెండో వైపు కూడా ఉంది. 

అదే ట్రాలింగ్.. వేధింపులు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా వాగేయడం ఎక్కువైపోయింది. ఈ తిట్ల బారిన పడని సెలబ్రిటీ ఒక్కరూ కూడా ఉండడం లేదు. కొందరు సైలెంట్ గా ఉంటే.. మరికొందరు స్ట్రాంగ్ రిటార్ట్ ఇస్తున్నారు. మోడలింగ్ తో పాటు గతంలో బిగ్ బాస్ షోలో పోటీ పడి.. ఆ తర్వాత నన్ గా మారి.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సోఫియా హయత్.. ఇప్పుడు తనకు రేటు కట్టిన ఓ వ్యక్తిని తెగ తిట్టి పోసింది. ఒక రాత్రి తనతో గడిపితే 20 లక్షలు ఇస్తానంటూ ఒక వ్యక్తి ఆమెకు మెసేజ్ పెట్టాడు. 

దీనికి రిప్లై ఇచ్చిన ఆమె.. '20 లక్షలతో నేను ** తుడుచుకుంటాను. 20 కోట్లు అయినా సరే నన్ను కొనలేవు' అని పోస్ట్ చేసిన సోఫియా హయత్ ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసి షేర్ చేసింది. అంతే కాదు.. ఆ 20 లక్షలు మీ అమ్మన కొనగలవేమో ఓ సారి అడిగి చూడు అంటూ చెప్పుచ్చుకు కొట్టిన రీతిలో రిప్లై ఇచ్చింది సోఫియా హయత్.