తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పై చెప్పుతో దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గుంపులోనుంచి విజయ్ పైకి చెప్పు విసిరారు. ఇంతకీ విషయంఏంటీ..?
తమిళ స్టార్ నటుడు విజయ్ పైకి చెప్పుతో దాడి జరిగింది. ఈ సంఘటన విజయ్ కాంత్ పార్ధీవ దేహాన్ని సందర్శించడానికి విజయ్ వచ్చినప్పుడు జరిగింది. నటుడు, డీఎండీకే అనగా దేశీయ ముర్పోక్కు ద్రావిడ కలగం పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్ నిన్న అనగా గురువారం(డిసెంబర్ 28) కన్నుమూసిన విషయం తెలిసిందే. కరోనాతో ఇబ్బదిపడుతూ ఆయన కన్నుమూశారు. ఈక్రమంలో ఆయనకు తుది నివాళి అర్పించడం కోసం సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ పోటీ పడ్డారు.
తమిళ తలైవా రజినీకాంత్ తో పాటు కమల్ హాసన్, విజయ్ ఆంటోనీ, ఇతర హీరోలు, దర్శకులు, నటీమణులు ఇలా సెలబ్రిటీలంతా విజయ్ కాంత్ కు నివాళ అర్పించడం కోసం క్యూ కట్టారు. ఈక్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా కెప్టెన్ కు నివాళి అర్పించడం కోసం వెళ్ళారు.
నిన్న రాత్రి డీఎండీకే ప్రధాన కార్యాలయంలో విజయకాంత్ పార్థివదేహాన్ని ఉంచగా.. ఆయనకు అందరు నివాళి అర్పిస్తూ..కెప్టెన్ ఫ్యామిలీని ఓదార్చారు. ఈక్రమంలో కోలీవుడ్ నటుడు దళపతి విజయ్ కూడా విజయకాంత్‌కు నివాళులర్పించాడు. అనంతరం విజయ్ కాంత్ భార్య ప్రేమలత విజయకాంత్‌తో విజయ్ మాట్లాడి అక్కడనుంచి వెళ్లిపోయారు.
అయితే విజయ్ దళపతి వచ్చిన సమయంలో అక్కడ తోపులాట జరిగింది. జనాలు ఎగబడ్డారు. వారిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఒకేసారి విజయ్ మీదకు జనాలు వచ్చిపడటంతో పాటు..దళపతి మీదకు జనాల మధ్య నుంచి గుర్తు తెలియాని వ్యక్తి ఒకరు చెప్పు విసిరారు ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. విజయ్ ఫ్యాన్స్ ఈ విషయంలో మండిపడుతున్నారు.
అంతే కాదు తమిళనాట విజయ్ తోపాటు మరో స్టార్ హీరో అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలుఉన్నాయి. దాంతో విజయ్ అంటే పడని సదరుహీరో అభిమానులు ఎవరైనా ఇలా చేసి ఉంటారు అని అంటున్నారు. ఈ విషయయాన్ని విజయ్ ఫ్యాన్స్ తో పాటు అందరూ ఖండిస్తున్నారు. అలా చేయడం మంచి పద్దతి కాదు అని హెచ్చరిస్తున్నారు. ఇక విజయ్ కాంత్ అంత్యక్రియయలు ప్రభుత్వ లాంచనాలతో జరిగాయి. కెప్టెన్ కుసబంధించిన డీఎండీకే పార్టీ ఆఫీస్ లోనే ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో జరిపించింది ప్రభుత్వం.
