శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రిన్స్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను ‘జాతిరత్నాలు’ చిత్ర దర్శకుడు అనుదీప్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను తెలుగులో కూడా మంచి క్రేజ్ మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 23న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ప్రిన్స్ చిత్రానికి ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది...ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ హక్కులు కలిపి ప్రిన్స్ మూవీకి దాదాపు రూ.100 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని చెప్తున్నారు. అయితే తెలుగులో అంత మార్కెట్ లేదు. తమిళంలోనే శివకార్తికేయన్ కు ఉన్న క్రేజ్ ని బట్టి ఆ స్దాయి బిజినెస్ జరిగింది. ఇక తెలుగులో ఈ సినిమాకు రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. శివ కార్తికేయన్ గత చిత్రాలు డాక్టర్, డాన్ వంటివి రూ.2 కోట్ల లోపే బిజినెస్ జరిగిపుకున్నాయి. ఇక ఇప్పుడు రూ.8 కోట్లకు పైగా పెరిగిందని చెప్తున్నారు. అందుకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఓ కారణం... దర్శకుడు అనుదీప్ క్రేజ్ కూడా తోడైంది. తన మార్క్ కామెడీతో ‘జాతిరత్నాలు’ సినిమాతో ఏకంగా రూ.40 కోట్ల వరకు షేర్‌ను సాధించటమే కలిసొచ్చింది.
ఈ సినిమా రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 23 నిమిషాలకు లాక్ చేసింది చిత్ర యూనిట్. ఇలాంటి రన్‌టైమ్ సినిమాకు బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఒక స్కూల్ లో హీరో, హీరోయిన్స్ టీచర్స్ గా పనిచేస్తూ ప్రేమలో పడతారు. అక్కడ సరదా సన్నివేశాలు, పాటలు, వీరి ప్రేమని హీరోయిన్ సైడ్ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వచ్చే కష్టాలు, హీరో వేరే దేశం అమ్మాయిని ప్రేమించాడని ఊళ్ళో వాళ్ళు అతనిని తిట్టడం, కొన్ని కామెడీ సీన్స్, కులం, మతం లేదు అందరు ఒక్కటే అని తిరిగే హీరో నాన్న నువ్వు ఏకంగా వేరే దేశం అమ్మాయినే ప్రేమించావా అని హీరోని పొగడటం.. ఇలా సరదాగా ఓ లవ్, ఎమోషన్ కథని తీసి వదిలిన చిత్రం ప్రిన్స్.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించాయి. శివ కార్తికేయన్‌కు జోడీగా మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను మంచి అంచనాల మధ్య దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ప్రిన్స్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.
జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించిన తెలుగు-తమిళ ద్విభాషా మూవీ ప్రిన్స్. షూటింగ్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు.
