Asianet News TeluguAsianet News Telugu

దీపావళికి సందడి చేసేందుకు శివకార్తికేయన్‌ రెడీ.. `అయలాన్‌` ఫస్ట్ లుక్‌ అండ్‌ రిలీజ్‌ డేట్‌

శివకార్తికేయన్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన `అయలాన్‌` చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోపాటు రిలీజ్‌డేట్‌ని ప్రకటించారు.  

siva karthikeyan ayalaan movie release date announced with first look arj
Author
First Published Apr 24, 2023, 11:20 PM IST

ఎలాంటి సినీ బ్యాక్‌ గ్రౌండ్‌ లేని శివకార్తికేయన్‌ క్రమంగా ఎదుగుతూ ఇప్పుడు కోలీవుడ్‌లో స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. ఆయనకు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఇటీవల ఆయన నటించిన బైలింగ్వల్ `ప్రిన్స్` మెప్పించింది. కానీ కమర్షియల్‌గా సత్తాచాటలేకపోయింది. అంతకు ముందు డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు శివకార్తికేయన్‌. ఇప్పుడు మరోసారి ఆయన తన సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని అలరించబోతున్నారు. ఆయన హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన `అయలాన్‌` చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. 

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోపాటు రిలీజ్‌డేట్‌ని ప్రకటించారు. దీపావళి సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేజీఆర్‌ స్టూడియోస్‌, 24ఎఎం స్టూడియోస్‌ పతాకాలపై కోటపాడి జే. రాజేష్‌, ఆర్‌ డీ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్‌ విన్నర్‌ సంగీత దర్శకుడు ఏ ఆర్‌ రెహ్మాన్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు. అయలాన్‌ అంటే ఏలియన్‌ అని అర్థం. తాజాగా రిలీజ్‌ చేసిన ఫస్ట్ లుక్‌లో శివ కార్తికేయన్‌.. ఏలియన్‌తో కలిసి కనిపించడం విశేషం. ఇలాంటి డిఫరెంట్ స్టోరీతో సినిమా రావడం సౌత్ ఇండియాలోనే తొలిసారి అని చెప్పవచ్చు. 

`ఇంతకు ముందు కొన్ని సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చాయి. కానీ ఇలాంటి ఏలియన్ పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రాలేదు. దీపావళి కానుకగా నవంబర్‌లో 'అయలాన్'ను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నాం` అని నిర్మాత కోటపాడి జె. రాజేష్ తెలిపారు. కోటపాడి జె. రాజేష్ మాట్లాడుతూ, `మేం ఎంతో ప్రేమతో, మనసుపెట్టి చేసిన చిత్రమిది. ఈ జర్నీలో మాకు కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ధైర్యాన్ని కోల్పోలేదు. పట్టుదలతో సినిమా చేశాం. ఇప్పుడు విడుదల తేదీ అనౌన్స్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఎంతో మద్దతు ఇస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. వాళ్ళ అంచనాలకు మించి సినిమా ఉంటుంది` అని చెప్పారు. 

`సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్, అందులోనూ ఏలియన్స్ నేపథ్యంలో తీసే సినిమాలు అంటే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం టీమ్‌ చాలా కష్టపడ్డారు. 'అయలాన్'లో 4500లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని, ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ సినిమా ఇదేన`ని చిత్ర బృందం తెలియజేసింది. పలు సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఫాంటమ్ ఎఫ్ఎక్స్ కంపెనీ 'అయలాన్'లో ఏలియన్ సహా ఇతర గ్రాఫిక్స్ వర్క్ చేసింది. పాన్ ఇండియా సినిమాలో ఇన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటం ఇదే తొలిసారి, పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం ఎక్కువ సమయం పట్టిందని  తెలిపింది.

తెలుగులో 'చంద్రలేఖ', 'ప్రేమతో రా', 'కేశవ' చిత్రాల్లో నటించిన ఇషా కొప్పికర్, ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర పోషించారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేమ్ శరద్ కేల్కర్ మరో పాత్ర చేశారు. సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు ఇతర తారాగణం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాకు పని చేసిన నీరవ్ షా 'అయలాన్'కు వర్క్ చేశారు. ఈ సినిమాకు రూబెన్ ఎడిటర్.  ఇంకా ఈ చిత్రానికి పోస్టర్ డిజైన్ : గోపి ప్రసన్న, ప్రొడక్షన్ డిజైన్ : టి. ముత్తురాజ్, వీఎఫ్ఎక్స్ : బిజోయ్ ఆర్పుతరాజ్ (ఫాంటమ్ ఎఫ్ఎక్స్), కాస్ట్యూమ్ డిజైన్ : పల్లవి సింగ్, నీరజా కోన, కొరియోగ్రఫీ : గణేష్ ఆచార్య, పరేష్ శిరోద్కర్, సతీష్ కుమార్,  సంగీతం : ఏఆర్ రెహమాన్, నిర్మాతలు : కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా, దర్శకత్వం : ఆర్. రవికుమార్.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios