రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'ఎంతవారలైనా' చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ పేర్కొంది. రామదూత ఆర్ట్స్ బ్యానర్ లో జి సీతా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గురు చిందేపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. 

నిర్మాత సీతా రెడ్డి మాట్లాడుతూ మా బ్యానర్ లో వచ్చిన తొలి చిత్రం ఎంతవారలైనాకి మంచి రెస్పాన్స్ వస్తుండడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా కూడా మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. సన్నిహితులు, మిత్రులు ఫోన్ చేస్తూ సినిమా బావుందంటూ అభినందిస్తున్నారు. ఈ చిత్రం అందించిన ఉత్సాహంతో మరో చిత్రానికి రెడీ అవుతున్నాం అని సీతారెడ్డి తెలిపారు. 

'మేజర్ చక్రధర్' అనే టైటిల్ ని తమ రెండవ చిత్రానికి ఖరారు చేసినట్లు సీతా రెడ్డి ప్రకటించారు. ఒక ఆర్మీ మేజర్ సమాజంలోని సమస్యలపై ఎలా పోరాటం చేశాడు అనే పవర్ ఫుల్ పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. నటీనటుల వివరాలని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.