యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న 'సీత' సినిమా మే 24న విడుదలకు సిద్ధంగా ఉంది. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా.. సోను సూద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. 

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. విడుదలకు మరో రెండు వారాలే ఉండడంతో ఇప్పుడు చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. ఈ క్రమంలో రేపు విడుదల కాబోతున్న 'మహర్షి' సినిమా థియేటర్లలో 'సీత' ట్రైలర్ ని ప్రదర్శించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'రిషిని రామ్ కలవబోతున్నాడు.. మీకు దగ్గరగా ఉన్న థియేటర్లలో మహేష్ బాబు 'మహర్షి'తో పాటు 'సీత' ట్రైలర్' కూడా చూడండి అంటూ హీరో బెల్లంకొండ తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.