కాజల్ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వం వహించిన 'సీత' మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కాజల్ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వం వహించిన 'సీత' మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోగా నటించగా.. సోనూసుద్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.
ఈ సినిమా ట్రైలర్, టీజర్ లతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశారు. కాజల్ క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు కొన్ని చోట్ల ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది.
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, కాజల్ క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని అంటున్నారు. సినిమా మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతుందని కాజల్ అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు. బెల్లంకొండ మాత్రం కాస్త విసిగించాడని టాక్.
సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా ఉందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమాను ఒకసారి చూడొచ్చని అంటున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌లో రాంబ్రహ్మం సుంకర నిర్మించారు.
