ధనుష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారని అర్దమవుతోంది. ప్రీమియర్ షోలు హౌస్ ఫుల్ అవ్వడంతో సినిమా విజయం పై చిత్రయూనిట్ మరింత కాన్ఫిడెంట్ గా ఉంది.
ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ చిత్రం వాతి. తెలుగులో సార్ టైటిల్ తో విడుదల అవుతోంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. చిత్ర యూనిట్ ప్రస్తుతం అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం ప్రీమియర్స్ వేస్తున్నారు.
సినిమా 17న రిలీజ్ అవుతుండగా ఒక రోజు ముందే 16న రాత్రి చెన్నై, హైదరాబాద్ లోని థియేటర్లలో ప్రీమియర్ వేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో సార్ సినిమా 3 ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అయితే ప్రీమియర్ ప్రకటించిన గంటకే అన్ని షోల టికెట్స్ అయిపోవటం రికార్డ్. అన్ని షో లు హౌస్ ఫుల్ అవ్వడం విశేషం. దీంతో సార్ సినిమా కోసం ధనుష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారని అర్దమవుతోంది. ప్రీమియర్ షోలు హౌస్ ఫుల్ అవ్వడంతో సినిమా విజయం పై చిత్రయూనిట్ మరింత కాన్ఫిడెంట్ గా ఉంది. ఇకవైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు లో కూడా ఈ రోజు ఈవినింగ్ ప్రీమియర్ షోలు పడనున్నాయి.
ఇకపోతే ఇలా ప్రీమియర్ షోలు వేయడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ...విడుదల రోజు ఉదయానికి పాజిటివ్ మౌత్ టాక్ రావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. కాబట్టి మొదటి రోజు ఓపెనింగ్స్ అలాగే పబ్లిక్ హాలిడేస్ అయినా తర్వాత రెండు రోజులు సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం..
నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు . జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్ విడుదల అవ్వగా ప్రస్తుతం ఉన్న సమాజంలో విద్యావ్యవస్థ పై ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది కాన్సెప్ట్ గా సినిమాను తెరకెక్కించారు. తాజాగా సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
