సింగర్ సునీత కొడుకు హీరోగా సినిమా.. దర్శకేంద్రుడు నిర్మాతగా ప్రారంభం..
సింగర్ సునీత తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తుంది. ఆకాష్ హీరోగా సినిమా నేడు రిపబ్లిక్ డే సందర్భంగా నేడు(గురువారం) సినిమా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

సింగర్ సునీత సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, పాటల షోకి జడ్జ్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన కుమారుడిని సినిమాల్లోకి తీసుకువస్తుంది. గతంలోనూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా హీరోగా పరిచయం చేసింది. కుమారుడు ఆకాష్ హీరోగా సినిమాని ప్రారంభించింది. `సర్కారు నౌకరి` పేరుతో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. దీన్ని గురువారం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఈ సినిమా స్టార్ట్ కావడం విశేషం. పీరియడ్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఆకాష్ హీరోగా, నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి కెమెరామెన్ కావడం విశేషం. ఇక సినిమాని ఆర్.కె.టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక గురువారం ప్రారంభమైన ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో జీ స్టూడియోస్ నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచాన్ చేయగా, మ్యాంగో మీడియా అధినేతన, గాయని సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్‌నిచ్చారు.
అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన తొలిషాట్‌కి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, గాయని సునీత కెమెరా స్విచాన్ చేశారు. ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో ఆకాష్, భావనా వళపండల్ జంటగా నటించగా, తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకి పనిచేస్తున్న టెక్నీషియన్లు చూస్తే,
మ్యూజిక్ : శాండిల్య
ఆర్ట్ డైరెక్టర్ : రవి,
కో డైరెక్టర్ : రమేష్ నాయుడు దళే
కాస్ట్యూమ్ డిజైనర్ : రితీషా రెడ్డి
పీ.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ డిజైనర్: బాబు దుండ్రపెల్లి
నిర్మాణం : ఆర్.కె టెలీషో ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రఫీ,రచన,దర్శకత్వం : గంగనమోని శేఖర్,