సారాంశం

తన గాత్రంతో శ్రోతలని అలరించే గాయని సింగర్‌ సునీత.. తాజాగా `రంగమార్తాండ` గురించి మాట్లాడింది. సినిమా చూశాక తనలో కలిగిన భావాలను బయటపెట్టింది.
 

సింగర్‌ సునీత తనదైన గాత్రంతో అలరిస్తున్న విషయం తెలిసిందే. అమృతం లాంటి గాత్రంతో పాటలు పాడుతూ శ్రోతలని అలరించే ఆమె చాలా అరుదుగా సినిమా గురించి మాట్లాడింది. `రంగమార్తాండ` సినిమా గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గుండె బరువెక్కిందంటూ, గుబులు మొదలైందంటూ ఎమోషనల్‌ వర్డ్స్ వెల్లడించింది. తాజాగా సింగర్‌ సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఇది వైరల్‌ అవుతుంది. 

ఇందులో సునీత మాట్లాడుతూ, ఇప్పుడే సినిమా చూశానని, ఆ ఫీలింగ్‌ని మీతు పంచుకోకుండా ఉండలేకపోతున్నానని, అందుకే ఈ వీడియో పెడుతున్నట్టు చెప్పింది సునీత. సినిమాలో పాత్రలను దర్శకుడు కృష్ణవంశీ అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమా చూశాక తన గుండె బరువెక్కిందని చెప్పింది. అంతేకాదు సినిమా చూశాక తన హృదయంలో గుబులు స్టార్ట్ అయ్యిందట. గుండె బరువెక్కిన ఫీలింగ్‌ కలుగుతందట. కానీ బరువు చాలా బాగుందని చెప్పింది. మనసు గుబులుగా ఉంటే అందులోనే ఉండిపోవాలనిపిస్తుందని, ఇలాంటివి డైరెక్టర్‌ కృష్ణవంశీకే సాధ్యమని చెప్పింది. `రంగమార్తాండ` సినిమా చాలా బాగుందని, తనకు బాగా నచ్చిందని, మీరు కూడా కచ్చితంగా సినిమా చూడాలని చెప్పింది. మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయని ఎమోషనల్‌ కామెంట్స్ చేసింది సునీత. ప్రస్తుతం ఆమె వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. 

View post on Instagram
 

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత దర్శకుడిగా చేసిన చిత్రం `రంగమార్తాండ`. ఇది చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. కానీ రిలీజ్‌ డేట్‌ కోసం వెయిట్‌ చేస్తూ వస్తున్నారు దర్శకుడు. సినిమాకి బజ్‌ రాకపోవడంతో వెయిట్‌ చేశారు. ఇటీవల సెలబ్రిటీలకు ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారు. ఈ స్పెషల్‌ షోస్‌కి మంచి స్పందన లభిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు బాగుందంటూ సందేశాలు పెడుతున్నాఉ.  మంచి బిజినెస్‌ కూడా జరిగిందని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని రిలీజ్‌ చేసేందుకు ముందుకొచ్చారట. దీంతో విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల(మార్చి) 22న ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. ఇందులో ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, అనసూయ ముఖ్య పాత్రలు పోషించారు.