బిగ్ బాస్ 14 కంటెస్టెంట్ గా ఉన్న జాన్ కుమార్ సాను వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మరాఠీ భాషలో మాట్లాడవద్దని ఓ కంటెస్టెంట్ కి అతను సూచించడం వివాదాస్పదం అయ్యింది. దీనిపై మరాఠా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో పాటు, ఎమ్ ఎస్ ఎన్ అమేయా నాయకుడు జాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇకపై ముంబైలో అతని కెరీర్ ముగిసినట్లే అని చెప్పడం జరిగింది. 

జాన్ కుమార్ సాను వ్యాఖ్యలకు సర్వత్రా నిరసనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో సింగర్ కుమార్ సాను నష్ట నివారణ కార్యక్రమం చేపట్టే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా ఆయన ఓ వీడియో సందేశం ద్వారా క్షమాపణలు చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో తన కుమారుడు జాన్ తప్పుగా మాట్లాడాడని తెలుసుకొని బాధపడ్డాను అన్నారు. ముంబా దేవి నాకు నేమ్, ఫేమ్ అన్నీ ఇచ్చింది. అలాంటి మహారాష్ట్రను, భాషను నేను ఎంతో గౌరవిస్తాను. దేశంలోని అనేక భాషలలో పాటలు పాడిన నేను అన్ని భాషలను గౌరవిస్తాను అన్నారు. 

ఇక 27ఏళ్ళు తనకు నేను దూరంగా ఉన్నాను. వాళ్ళ అమ్మ వాడికి ఏమి మాట్లాడాలి...ఎలా మాట్లాడాలి అనే విషయంలో ఎలాంటి శిక్షణ ఇచ్చిందో తెలియదు. ఏదిఏమైనా తన మాటలకు ఒక తండ్రిగా నేను క్షమాపణ చెవుతున్నాను అని కుమార్ సాను ఆ వీడియో సందేశంలో తెలియజేశారు.