ప్రముఖ సింగర్ గీత మాధురి త్వరలో తల్లి కాబోతోంది. గత ఏడాది జరిగిన బిగ్ బాస్ 2 షో లో గీతా మాధురి రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ షో తర్వాత గీత మాధురి పెద్దగా మీడియా ముందుకు రాలేదు. గీతా మాధురి, ప్రముఖ నటుడు నందు 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

గీత మాధురి సింగర్ గా రాణిస్తుండగా, నందు సినిమాల్లో నటిస్తున్నాడు. బిగ్ బాస్ షో లో కౌశల్ కు గట్టి పోటీ ఇచ్చింది గీతా మాధురి మాత్రమే. ఓ దశలో గీతా మాదిరి విజేత అంటూ ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు గీతా మాధురి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా నందు, గీతా మాధురి దంపతులు తల్లిదండ్రులు కాబోతుండడంతో వారి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. 

ఇటీవలే గీతా మాధురి శ్రీమంతం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గీతా మాధురి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో 500పైగా పాటలు పాడారు.