Bigg Boss Telugu 7: హౌజ్ నుంచి స్టార్ సింగర్ దామిని ఎలిమినేట్?
`బిగ్ బాస్ తెలుగు 7` షోలో మూడో వారం ఎలిమినేషన్ పెద్ద షాక్‌కి గురి చేస్తుంది. ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యపరుస్తుంది.
బిగ్ బాస్ తెలుగు 7 వ సీజన్‌లో చాలా వరకు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత సీజన్‌లో చాలా డిప్లామాటిక్‌గా వ్యవహరించిన హోస్ట్ నాగార్జున.. ఈ సారి అందరిని వరుస బెట్టి క్లాస్ పీకుతున్నారు. తప్పు చేసిన వారిపై ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో హౌజ్‌లోనూ కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ షోపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రారంభం నుంచి ఈ సారి షో `ఉల్టా ఫుల్టా` అన్నట్టుగానే.. సాగుతుంది.
ఇక మూడో వారం ఎలిమినేషన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. రెండు వారాల్లో ఇద్దరు సీనియర్లని ఇంటి నుంచి పంపించేశారు. మొదటి వారం కిరణ్ రాథోర్ ని ఎలిమినేట్ చేయగా, రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయ్యారు. వీరిద్దరు జస్ట్ కూర్చొని ముచ్చట్లు పెట్టారు, గేమ్‌లో ఎక్కడా యాక్టివ్‌గా లేరు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు వెళ్లిపోయారు. ఇప్పుడు మూడో వారం మూడో ఎలిమినేషన్ వంతు వచ్చింది. ఇందులో ఆసక్తికర, షాకింగ్ విషయం లీక్ అయ్యింది. మూడో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేలిపోయింది.
మూడో వారంలో దామిని ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ వారం నామినేషన్స్ లో అమర్ దీప్, దామిని, గౌతంకృష్ణ, ప్రియాంక, పిన్స్ యావర్, రతిక, శుభ శ్రీ ఉన్నారు. వీరిలో దామిని, తేజలకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయట. అయితే తేజ అంతో ఇంతో కామెడీ చేస్తూ నవ్విస్తున్నారు. కానీ దామిని మాత్రం వంటలు చేస్తూ కిచెన్‌లోనే టైమ్ స్పెండ్ చేస్తుంది. గేమ్‌లో మాత్రం ఆమె ఇన్‌వాల్వ్ మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఆ ప్రభావం ఆమెకి వచ్చే ఓట్లపై పడినట్టు తెలుస్తుంది.
అయితే గత వారంలో ఇద్దరూ ఇలా కూర్చొని సైలెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు దామినిని కూడా ఇంటికి పంపించేస్తున్నారు. ఈ రకంగా ఓ విషయం స్పష్టమవుతుంది. ఇలా గేమ్‌లో, హౌజ్‌లో యాక్టివ్‌గా లేకుండా కూర్చొని ముచ్చట్లు పెడుతూ, కంటెండ్ ఇవ్వకుండా టైమ్ పాస్ చేసే బ్యాచ్‌ని సైలెంట్‌గా బిగ్ బాస్ ఇంటికి పంపిస్తున్నారని అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్న వారిలోనూ తేజతోపాటు అమర్ దీప్, రతిక, శివాజీ సైతం ముచ్చట్లకే పరిమితం అవుతున్నారు. అయితే శివాజీ పవర్ అస్త్ర సాధించాడు కాబట్టి మూడు నాలుగు వారాలు సేఫ్. మిగిలిన వాళ్లు డేంజర్ జోర్‌లో ఉన్నారని అర్థమవుతుంది.
ఇదిలాఉంటే దామిని ఎలిమినేషన్‌కి సంబంధించిన నెటిజన్లు, వ్యూవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సీజన్లలో ఎప్పుడూ ఓ సింగర్ ఇంత తొందరగా ఎలిమినేట్ కాలేదని, మొదటిసారి ఇది జరుగుతుందని అంటున్నారు. గత సింగర్లు ఆటతోపాటు పాటలతో అలరించారు. దామినిలో ఆట లేదు, పాట లేదు, కేవలం యాటిట్యూడ్ మాత్రమే ఉందని కామెంట్లు చేయడం గమనార్హం. మరి నిజంగానే దామిని ఎలిమినేట్ అవుతుందా? ఇందులో ఏదైనా ట్విస్ట్ ఉందా? అనేది మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది.