Asianet News TeluguAsianet News Telugu

టైట్‌గా ఉంటేనో, నొప్పి వస్తేనో, రక్తం కారితే మాత్రమే వర్జిన్ కాదంటూ చిన్మయ

  తొలి కలయిక మీదుండే అపోహలు, అమ్మాయిలను అబ్బాయిలు ట్రీట్ చేసే విధానం మీద స్పందించింది. ఓ ఇనిస్ట్రా వీడియో చేసింది. ఆ వీడియో మీరూ చూడండి.
 

Singer Chinmayi slams trolls on First Experience
Author
First Published Mar 17, 2023, 8:15 AM IST


ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి  గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన  అవసరం లేదు. సినిమా సంగతులు కంటే ఎక్కువ వివాదాలతోనే చిన్మయి కేజ్ తెచ్చుకుందనటంలో అతిశయోక్తి లేదు. మన చుట్టు సొసైటిలో జరిగే ప్రతి అసాంఘిక చ్యర్య , ఆడవారి సమస్యలపైన చిన్మయి స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ ఉంటారు. అవి వైరల్ అవుతూంటాయి.

 ముఖ్యంగా ఆడవాళ్ళ పై జరిగే అకృత్యాలపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ స్పందిస్తూ ఉండటం చాలా మందికి నచ్చే విషయం.స్పూర్తి దాయకమైనది.  అదే సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల మీద నిర్మొహమాటంగా స్పందిస్తూ ఉంటుంది. మహిళల పర్సనల్ విషయాలను సైతం ఎంతో ధైర్యంగా, బహిరంగంగానే  చర్చిస్తూంటుంది. సింగర్ చిన్మయి ఇప్పుడు తొలి కలయిక మీదుండే అపోహలు, అమ్మాయిలను అబ్బాయిలు ట్రీట్ చేసే విధానం మీద స్పందించింది. ఓ ఇనిస్ట్రా వీడియో చేసింది. ఆ వీడియో మీరూ చూడండి.

 వీడియోలో అమ్మాయిలకు తొలి కలయిక సమయంలో నొప్పి ఉంటుందని, రక్తం వస్తేనే వర్జిన్ అని, టైట్‌గా ఉంటేనే వర్జిన్ అని అంటుంటారని, అవన్నీ కేవలం అపోహలేనని చిన్మయి చెప్పుకొచ్చింది. ఓ ట్రోల్ వీడియోను షేర్ చేసి ఆ విషయాన్ని చెప్పింది. పెళ్లి కొడుకులు ఇలా ఊహిస్తారని, కానీ రియాల్టీలో ఇలా ఉంటుందని షేర్ చేసిన ట్రోల్ వీడియో మీద చిన్మయి మండి పడుతూ ఈ వీడియో చేసింది.

వెజినా (యోని) టైట్‌గా ఉంటేనో, రక్తం కారితేనో, నొప్పి వస్తేనో వర్జిన్ అని అపోహ పడుతుంటారని, కానీ అవన్నీ అబద్దాలని చెప్పుకొచ్చింది చిన్మయి. నిజానికి తొలి కలయిక సమయంలో అమ్మాయిలకు మరింత బాధ, నొప్పి అంటే అది వైద్య పరంగా పెద్ద సమస్య అని, వెంటనే చికిత్స తీసుకోవాలని చిన్మయి సూచించింది.   తొలి కలయిక సమయంలో మరీ టైట్‌గా ఉండి, నొప్పి వస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని   చెప్పింది. 

ఇలాంటి విషయాలను డిస్కస్ చేయడానికి సిగ్గు పడొద్దని, కానీ ఇప్పటి సమాజం అలానే వ్యవహరిస్తుంటుందని, ఇలాంటి విషయాలు ఇలా మాట్లాడతారా? అని మనల్నే తక్కువ చేసి చూస్తారని చిన్మయి చెప్పుకొచ్చింది.  ఇలా తొలి కలయిక మీద అబ్బాయిలు వేసే ట్రోల్స్, జోకులు, మీమ్స్ నిజం కాదని, అవన్నీ అపోహలేనని కొట్టి పారేసింది. ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే వైద్యులను సంప్రదించండని చిన్మయి సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios