ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ డిసెంబర్ 1న తన చిరకాల ప్రేయసి శ్వేతా అగర్వాల్ మెడలో తాళి కట్టాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ముంబైలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బంధు మిత్రులు, అత్యంత సన్నహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కావడం జరిగింది. కొత్తగా పెళ్ళైన ఈ వధూవరులు నూతన గృహ ప్రవేశం చేశారు. 

 
ఆదిత్య నారాయణ్, శ్వేతా అగర్వాల్ అడుగుపెట్టిన ఇంటి గురించి బాలీవుడ్ మీడియాలో అనేక కథనాలు రావడం జరిగింది. ఈ కొత్త ఇంటి ఖరీదు నాలుగు కోట్లని, విలాసవంతమైన ఇల్లు అని వరుస కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై ఆదిత్య నారాయణ్ స్పందించారు. మీడియా పొరపాటు పడుతుంది. నా ఇంటి విలువు తక్కువ అంచనా వేస్తున్నారని కామెంట్ చేశాడు. 
 
బాల్యం నుండే నేను బుల్లి తెర ద్వారా సంపాదిస్తున్నానని, టెలివిజన్ తనకు ఎంతో ఇచ్చిందని తెలిపాడు. మీరు అనుకుంటున్నట్లు నా కొత్త ఇంటి ధర నాలుగు కోట్లు కాదు, పదిన్నర కోట్లని షాక్ ఇచ్చాడు. మరి ఈ విషయంలో ఆదిత్య నారాయణ్ నిజం చెప్పాడా లేక సెటైర్ వేశాడో అర్థం కావడం లేదు. ఆదిత్య నారాయణ్ తండ్రి ఉదిత్ నారాయణ్ తెలుగు ప్రేక్షకులు బాగా పరిచయం. తెలుగులో అనేక హిట్ సాంగ్స్ ఆయన పాడడం జరిగింది.