Asianet News TeluguAsianet News Telugu

సీ3గా టైటిల్ మారిన సూర్య సింగం3 సినిమా

  • సింగం 3 టైటిల్ మార్పు
  • పన్ను మినహాయింపు కోసం పేరు మార్పు
  • అఫీషియల్ ట్విటర్ లో ఎనౌన్స్ చేసిన నిర్మాణ సంస్థ
singam 3 name change to c3

త‌మిళ హీరో సూర్య న‌టించిన తాజా చిత్రం ఎస్ 3. హ‌రి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో సూర్య స‌ర‌స‌న అనుష్క‌, శృతిహాస‌న్ న‌టించారు.స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ పై జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని ఈనెల 26న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ టైమ్ లో ఎస్ 3 టైటిల్ మార్చ‌డం విశేషం. ఇంత‌కీ కార‌ణం ఏమిటంటే...వినోద‌పు ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు గాను ఎస్ 3 (సింగం 3) ని కాస్త సీ 3 గా మార్చార‌ట‌.

 

ఈ సమాచారాన్ని చిత్ర‌ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...కోయంబ‌త్తూర్ లోని కోవైలో సీ 3 యూనిట్ సంద‌డి చేయ‌నుంది. కోవై లోని ఫ్యాన్స్ మీట్ కు సూర్య హాజ‌రు కానున్నారు అని తెలియ‌చేసారు.

Follow Us:
Download App:
  • android
  • ios