అప్పట్లో సౌత్ కుర్రకారును ఎంతగానో ఆకర్షించిన బ్యూటీ సిమ్రాన్. కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా ఒక స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకొని దాదాపు స్టార్ హీరోలందరితో అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. అవకాశాలు తగ్గినప్పుడు చిన్న తరహా హీరోలతో పాటు కమెడియన్స్ సరసన కూడా కథానాయికగా కనిపించింది. 

అయితే ఆమె కెరీర్ లో ఎంత ఎత్తుకు ఎదిగిన్న కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించే అవకాశం రాలేదు. మొదటిసారి పెట్ట సినిమా ద్వారా అమ్మడు రజినీ పాత్రకు ఆపోజిట్ గా నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందట. అయితే రీసెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సిమ్రాన్ రజినీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం గురించి వివరించింది. 

నేను రజినీ సర్ కి పెద్ద అభిమానిని. ఆయనతో నటించడం చాలా సంతోషంగా ఉంది. మంచి మనసున్న వ్యక్తి. స్వీట్ హార్ట్ పర్సన్. ఈ సినిమాలో రజినీకాంత్ గారు చాలా కొత్తగా కనిపిస్తారని చెబుతూ.. ఒక ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నానని సిమ్రాన్ వివరించింది.