Asianet News TeluguAsianet News Telugu

'సింహా' నిర్మాత అర్దనగ్న నిరసన...దిగివచ్చిన అధికారులు!

హైదరాబాద్ షేక్ పేట ఓయూ కాలనీలో సినీ నిర్మాత పరుచూరి శివరామప్రసాద్‌ నివసిస్తున్నారు. ఆయన ఉంటున్న వీధిలో వర్షం కురిసిన సమయంలో మోకాలి లోతు నీరు నిలువ ఉంటోంది. ఈ విషయాలను ఆధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేశారు.

Simha Producer protest for Road Repair
Author
Hyderabad, First Published Sep 18, 2019, 10:14 AM IST

హైదరాబాద్ లో చాలా రోడ్ లు వర్షాలు కురిసినప్పుడు చాలా దారుణంగా ఉంటూంటాయి. ఆ విషయమై చాలా కంప్లైంట్స్ వస్తూంటాయి. అయితే స్పందన అంతంత మాత్రం అంటూంటారు. ఈ విషయం గమనించే బాలయ్యతో సింహా వంటి సూపర్ హిట్ సినిమాని నిర్మించిన టాలీవుడ్ సినీ నిర్మాత పరుచూరి శివ రామప్రసాద్ జీహెచ్ఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ దీక్షకు దిగారు. దాంతో అధికారులు దిగిరాక తప్పలేదు.

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ షేక్ పేట ఓయూ కాలనీలో సినీ నిర్మాత పరుచూరి శివరామప్రసాద్‌ నివసిస్తున్నారు. ఆయన ఉంటున్న వీధిలో వర్షం కురిసిన సమయంలో మోకాలి లోతు నీరు నిలువ ఉంటోంది. ఈ విషయాలను ఆధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేశారు.

 నెల క్రితం కంకర తీసుకొచ్చి వీధిలో కుప్పగా పోశారు. ఆనాటి ఈనాటి దాకా పనులు మాత్రం చేపట్టలేదు. సోమవారం రాత్రి కంకరకుప్పల కారణంగా ప్రసాద్‌ కిందపడి గాయపడ్డారు. దీంతో సోమవారం రాత్రి నుంచి అక్కడే బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు. రోడ్డు పనులు చేపట్టే వరకు కదిలేది లేదని అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అధికారులు స్పందించి మంగళవారం మధ్యాహ్నం పనులకు శ్రీకారం చుట్టడంతో ఆయన దీక్ష విరమించారు.

ఈ విషయమై ...జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం పనులు ఆలస్యం అవ్వడానికి వినాయక నవరాత్రలు విధులు, పలు సమస్యత్మక ప్రాంతాల్లో చేపట్టిన పనుల కారణంగా లేట్ అయ్యిందని చెప్పుకొచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios