సౌత్ ఇండస్ట్రీ అగ్ర దర్శకుల్లో ఒకరైన శంకర్ రూపొందించిన '2.0' ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత శంకర్.. కమల్ హాసన్ హీరోగా 'భారతీయుడు2' సినిమాను రూపొందించబోతున్నారు.

కొన్నేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' సినిమాకి ఇది సీక్వెల్. దీంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్. విలన్ పాత్రలు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ ని కూడా తీసుకుంటున్నట్లు వినికిడి.

తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. అది ఎవరంటే హీరో శింబు. వివాదాలను కేరాఫ్ అడ్రెస్ అయిన శింబుని ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం తీసుకోవాలని అనుకుంటున్నారు. దాదాపు శింబు ఎంట్రీ ఖాయమని అంటున్నారు. ఈ సినిమాలో అతడు పోలీస్ పాత్ర పోషిస్తాడని అంటున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు.

ఇటీవల శింబు 'నవాబ్' సినిమాలో ఇతర హీరోలతో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు. ఈ సినిమా అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. మరి కమల్ తో కలిసి నటించనున్న 'భారతీయుడు2'తో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి!