మాస్ లవర్స్ కు మంచి ట్రీట్  రెడీ చేస్తున్నాడు యంగ్ అండ్ మాస్ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ. డీజే టిల్లు సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన హ్యాడ్సమ్ స్టార్.. మరో సర్ ప్రూజ్ ప్లాన్ చేశాడు.  

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ హల్ చల్ చేస్తోంది. ఒక్క సినిమా వచ్చి అది హిట్ అయ్యిందంటే చాలు.. దానికి పక్కాగా సీక్వెల్ తయారు అవుతుంది. ఫస్ట్ మూవీ హిట్ అయ్యింది కదా.. సీక్వెల్ సూపర్ హిట్ అవుతుంది అనుకోవడానికి లేదు. అలా అని ప్లాప్ అవుతుంది అని కూడా లేదు. మొత్తానికి ఏమైనా సరే సీక్వెల్ మాత్రం కామన్ అయిపోయింది. ఇక త్వరలో ఈ సీక్వెల్స్ లిస్ట్ లో చేరబోతోంది సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మాస్ మసాలా మూవీ డీజే టిల్లు. 

రీసెంట్‌గా డీజే టిల్లు తో బ్లాక్ బాస్ట‌ర్ హిట్టు కొట్టాడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ . సెకండ్ వేవ్ త‌ర్వాత బాక్సాపీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ సినిమాల్లో ఇది కూడా ఒక‌టి. గుంటూరు టాకీస్ ఫేం సిద్ధు ఈ మూవీలో ప‌క్కా హైద‌రాబాదీ స్టైల్‌లో కామెడీ ట‌చ్‌తో చేసిన యాక్టింగ్ యూత్ కు పిచ్చెక్కించింది. యంగ్ స్టార్స్.. కాలేజీ పిల్లలు డీజే టిల్లు సినిమాను భాగా ఆధరించారు. ఇక ఈమూవీ పాటలసంగతి చెప్పనక్కర్లేదు. డీజే టిల్లు మూవీ టైటిల్ సాంగ్ అయితే.. ఎక్కడ చూసినా.. ఇదే పాట అదే డాన్స్ అన్నట్టు ట్రెండ్ అయ్యింది. ఇక ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే..ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ను లైన్ లో పెట్టాడ‌ట సిద్దు. 

వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు సిద్థు. ఈ యంగ్ హీరో డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. అయితే సిద్థు సినిమాల్లో డీజేటిల్లు సీక్వెల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అవును రీసెంట్ ఫిల్మ్ నగర్ టాక్ ప్ర‌కారం సిద్దు ప్ర‌స్తుతం డీజీటిల్లు పార్ట్ 2 పై ఫోక‌స్ పెట్టిన‌ట్టు స‌మాచారం. ఫ‌స్ట్ పార్టు తెర‌కెక్కించిన సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సీక్వెల్ కూడా తెర‌కెక్కించ‌బోతుంద‌ని ఇన్ సైడ్ టాక్‌. సిద్దు అండ్ టీం స్క్రిప్టు ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్నారట. అంతే కాదు ఇప్పటికే స్కిప్ట్ వ‌ర్క్ దాదాపు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసిందట‌. 

ఈ సారి సీక్వెల్‌లో సిద్థు పూర్తిగా మరో కొత్త అవ‌తారంలో రావ‌డం ఖాయ‌మ‌ని అప్పుడే లెక్క‌లు వేసుకుంటున్నారు మూవీ ల‌వ‌ర్స్. క‌థ ప‌రంగా చూసుకుంటే సీక్వెల్‌లో ఫ‌స్ట్ పార్టు ఫ్లేవ‌ర్ కొన‌సాగింపున‌కు అంత స్కోప్ లేద‌నే చెప్పాలి. మ‌రి డీజే టిల్లు కొత్త ఫ్లేవ‌ర్ ఏదైనా యాడ్ చేస్తాడా..? కంప్లీట్ కొత్త వెర్ష‌న్‌తో వ‌స్తాడా..? అనేది చూడాలి. సీక్వెల్‌తో సిద్దు కొత్త హీరోయిన్‌ను ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడ‌ని టాక్‌. మరి వీటిన్నింటి గురించి పూర్తిగా వివరాలు తెలియాలి అంటే.. అనౌన్స్ మెంట్ వరకూ ఆగాల్సిందే.