‘టిల్లు స్క్వేర్’ (tillu square) పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్ట్‌పై చాలా హోప్స్ ఉన్నాయి సిద్ధుకు. ఇండస్ట్రీ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతోంది.
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగానే కాకుండా రచయితగా కూడా పాపులర్. ఓ ప్రక్కన నటిస్తూనే మరో ప్రక్కన తన సినిమా స్క్రిప్టు లు రాసేసుకుంటాడు. డైలాగులు ఇంప్రవైజ్ చేసేస్తూంటారు. 'కృష్ణ అండ్ హిజ్ లీల'తో ఆయన రచయితగా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'మా వింత గాధ వినుమా' రాశారు. ఆ తర్వాత 'డీజే టిల్లు'కు ఆ చిత్రదర్శకుడు విమల్ కృష్ణతో కలిసి కథ రాశారు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మించింది. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. ఈ సినిమాతో సిద్ధూ జొన్నలగడ్డ లైఫ్ మొత్తం మారిపోయిందనే చెప్పాలి.
ఆ క్రేజ్ ఏ స్దాయికి వెళ్లిందంటే సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండొచ్చు కానీ.. ‘డీజే టిల్లు’ అంటే తెలియనివారు ఉండరనే స్దాయికి . ‘డీజే టిల్లు’ (DJ tillu) సినిమా అంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కి రిలీజ్ కు రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. ‘టిల్లు స్క్వేర్’ (tillu square) పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్ట్‌పై చాలా హోప్స్ ఉన్నాయి సిద్ధుకు. ఇండస్ట్రీ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతోంది.
ఈ నేపధ్యంలో బయిట నుంచి సిద్దుని ఆఫర్స్ పలకరిస్తున్నా ఆచి,తూచి అడుగులువేస్తున్నాడు. నిర్మాత భోగవల్లి ప్రసాద్ సినిమా ఒకటి .సీనియర్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ సంస్థ ‘ఎస్వీసీసీ’తో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. వైష్ణవి అనే లేడీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించనుండడం విశేషం. ఈ నేపధ్యంలో సిద్దుకు ఎంత రెమ్యునరేషన్ అందనుందనే ఆసక్తికర విషయం ఓ ఆంగ్ల దినపత్రిక ద్వారా బయిటకు వచ్చింది.
ఆంగ్లదినపత్రిక కథనం ప్రకారం ఈ కొత్త సినిమా నిమిత్తం సిద్దు...3 కోట్లు తీసుకోనున్నారు. ‘టిల్లు స్క్వేర్’హిట్ అయితే సిద్దు నెక్ట్స్ సినిమాకు ఉండే క్రేజ్,బిజినెస్ వేరు. అందుకే ఆ స్దాయి రెమ్యునరేషన్ ఇస్తున్నారంటున్నారు. డిజే టిల్లు(Dj Tillu) మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో అడల్ట్ కంటెంట్ కొంచం ఓవర్ గా అనిపించగా కామెడీ సీన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో పడలేదు అనే చెప్పాలి…. కానీ ఓవరాల్ గా సీక్వెల్ హైప్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది.
